
ఇంటర్నెట్ డెస్క్: కెనడా మాజీ ప్రధాని జస్టిన్ ట్రూడో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. దానికి కారణం ఫిఫా వరల్డ్ కప్‌లో అమెరికా మ్యాచ్‌కు హాజరు కావడమే. తన గర్ల్‌ఫ్రెండ్ కేటీ పెర్రీతో కలిసి అమెరికా - పరాగ్వే మ్యాచ్‌ను ఆయన వీక్షించారు. ఈ మ్యాచ్‌లో అమెరికా 4-1 తేడాతో విజయం సాధించింది. ఫిఫా వరల్డ్ కప్ పోటీలకు అమెరికా ఆతిథ్యం ఇస్తోన్న సంగతి తెలిసిందే. మరి అమెరికా మ్యాచ్‌కు హాజరైతే తప్పేంటనే అనుమానం రాకమానదు. అయితే, ఆయన తన సొంత దేశం కెనడా మ్యాచ్‌కు హాజరు కాకుండా.. అమెరికా ఆడిన గేమ్‌కు వెళ్లడమే ఇక్కడ విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలో తనపై వస్తోన్న విమర్శలకు జస్టిన్ ట్రూడో స్పందించారు. ‘‘కొన్నిసార్లు సపోర్టివ్ బాయ్‌ఫ్రెండ్ బాధ్యతలు పిలుస్తాయి. కానీ, కప్ ఎవరు గెలవాలని నేను కోరుకుంటున్నానో మీకు తెలుసు’’ అని కెనడా జాతీయ జెండాను జత చేసి ట్రూడో పోస్టు పెట్టారు. గతేడాది నుంచి ట్రూడో-పెర్రీ తరచూ బయట కనిపిస్తూ ఉన్న వీడియోలు వైరల్‌గా మారాయి. మరోవైపు బోస్నియాతో జరిగిన పోరును కెనడా 1-1తో డ్రా చేసుకుంది. వరల్డ్ కప్‌లో తొలిసారి పాయింట్‌ను సాధించడం గమనార్హం. అమెరికా, మెక్సికోతోపాటు కెనడా కూడా ఫిఫా వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.