
గుజరాతీ ఫాజెటో తయారీకి కావాల్సినవి.. పెరుగు - కప్పు, మామిడి గుజ్జు - అర కప్పు, శనగ పిండి - రెండు స్పూన్లు, నీళ్లు - మూడు కప్పులు పచ్చి మిర్చి కావలసిన పదార్థాలు: పెరుగు - కప్పు, మామిడి గుజ్జు - అర కప్పు, శనగ పిండి - రెండు స్పూన్లు, నీళ్లు - మూడు కప్పులు పచ్చి మిర్చి - ఒకటి, అల్లం తరుగు - స్పూను, పసుపు - అర స్పూను, పోపు గింజలు - స్పూను, బెల్లం - చిన్న ముక్క, కరివేపాకు రెబ్బలు - ఎనిమిది, ఎండు మిర్చి - రెండు, ఇంగువ - కాస్త, నూనె - కాస్త. తయారుచేసే విధానం: పెద్ద గిన్నెలో పెరుగు, మామిడి గుజ్జు, శనగపిండి, పసుపు, ఉప్పు, నీళ్లు గిలక్కొట్టాలి. ఓ ప్యాన్లో కాస్త నూనె వేసి ఈ మిశ్రమాన్ని ఉడికించాలి. పచ్చిమిర్చి, అల్లం తరుగు, బెల్లం కలపాలి. దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించి, పోపు పెడితే గుజరాతీ ఫాజెటో సిద్ధం
.
Read Latest AP News And Telangana News And International News And Telugu News