
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. India vs Pakistan match: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో హైవోల్టేజ్ మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా గ్రూప్-1 మ్యాచ్‌లో భాగంగా భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. భారత కాలమానం ప్రకారం రాత్రి 7 గంటలకు మ్యాచ్ జరగనుంది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా మరోసారి షేక్ హ్యాండ్ అంశం తెరపైకి వచ్చింది. ఇదే అంశంపై టీమిండియా జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్, భారత్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గతలో పాకిస్థాన్, భారత ఆటగాళ్లు మైదానంలో కరచాలనం చేసుకోలేదు. ప్రస్తుతం మహిళల టీ20 వరల్డ్ కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడుతున్న నేపథ్యంలో ఇరు జట్ల ఆటగాళ్లు షేక్ హ్యాండ్ చేసుకుంటారా.. లేదా అనే అంశంపై ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఇదే అంశంపై భారత కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్‌ను మీడియా ప్రశ్నించింది. దీంతో ఆమె ఈ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ''మేము ఇక్కడికి క్రికెట్ ఆడేందుకు మాత్రమే వచ్చాం. మనం ఆట గురించి మాత్రమే మాట్లాడుకుందాం. క్రికెట్ మినహా మరే ఇతర అంశాలపై నేను మాట్లాడను. మేము కేవలం ఆట గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. ఇతర జట్లతో ఎలా ఆడతామో.. అలాగే పాకిస్థాన్ జట్టుతోనూ తలపడతాం. వందశాతం విజయం కోసం మా ప్రయత్నం ఉంటుంది'' అని హర్మన్ ప్రీత్ కౌర్ చెప్పారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్
యాప్ డౌన్లోడ్ చేసుకోండి.