
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు. Nitish Kumar Reddy Press Conference: అంతర్జాతీయ క్రికెట్ వేదికపై ఎంత బిజీగా ఉన్నా.. అమ్మ పిలుపు కంటే ఏదీ ఎక్కువ కాదని నిరూపించాడు తెలుగు ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి. ధర్మశాల వేదికగా అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డే అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఒక ఆసక్తికరమైన, అందమైన ఘటన చోటుచేసుకుంది. ప్రెస్‌మీట్ మధ్యలో అమ్మ ఫోన్..! మ్యాచ్ ముగిసిన తర్వాత నితీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా, ఒక్కసారిగా అతడి మొబైల్ మోగింది. స్క్రీన్‌పై 'అమ్మ' అని చూడగానే.. చుట్టూ ఉన్న రిపోర్టర్లను క్షమించమని కోరుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. "అమ్మా.. ప్రెస్మీట్లో ఉన్నాను. ఒక 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను" అంటూ పక్కా తెలుగులో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. అనంతరం అక్కడున్న విలేకరులకు చిరునవ్వుతో 'సారీ' చెప్పి మళ్లీ ప్రెస్‌మీట్‌ను కొనసాగించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్ల ప్రశంసల జల్లు ఈ వీడియో చూసిన క్రికెట్ అభిమానులు, నెటిజన్లు క్రికెటర్ నితీశ్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "గ్లోబల్ వేదికపై మన తెలుగు భాషను హైలైట్ చేశాడు, గర్వంగా ఉంది!" అని కొందరు అంటుంటే.. "అమ్మ అంటే అంత ప్రేమ మరి.. ఎంత పెద్ద స్టార్ అయినా అమ్మ తర్వాతే ఎవరైనా" అని మరికొందరు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. మ్యాచ్ హైలైట్స్ అఫ్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి
దూసుకెళ్లింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. భారత బౌలింగ్ దళాన్ని పరిశీలిస్తే.. అరంగేట్రం మ్యాచ్‌లోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో అదరగొట్టారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
భారత్ చేజింగ్‌లో 195 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 22.5 ఓవర్లలోనే కేవలం 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 84 పరుగులతో నాటౌట్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్ 39* పరుగులతో అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన శుభ్‌మన్ గిల్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.