
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడుతోంది.ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణా నది జలకళను సంతరించుకుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఈ ఉదయం గేట్లను ఎత్తివేశారు అధికారులు. సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నది దిగువ భాగానికి నీరు వదలడం ఇదే మొదటిసారి. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో స్థానిక పరివాహక ప్రాంతాల నుంచి బ్యారేజీకి వచ్చే నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో అదనపు నీటిని పరిమితంగా విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నారు.కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య నాలుగు గేట్లు ఎత్తారు. ఆ సమయంలో దిగువకు సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల మధ్య నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవంగా విడుదలైన నీటి పరిమాణం సుమారు 2,900 క్యూసెక్కులుగా నమోదైంది. స్థానిక క్యాచ్మెంట్ ప్రాంతాల నుంచి ఇన్ఫ్లో పెరగడంతో మిగులు నీటిని వదిలినట్లు వివరించారు.ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సంబంధిత శాఖల అధికారులకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి విడుదల తక్కువ పరిమాణంలోనే ఉన్నప్పటికీ, ప్రవాహం పెరిగే పరిస్థితులు ఉంటే
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీలో నేడు పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడటానికి అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. నేడు కూడా ఇదే పరిస్థితులు నెలకొన్నాయి. దక్షిణ కోస్తా తీర ప్రాంతం, రాయలసీమ జిల్లాలపై రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. పలు చోట్ల ఈదురుగాలులు, పిడుగులతో కూడిన వర్షం పడుతోంది.ఎగువ పరీవాహక ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల కృష్ణా నది జలకళను సంతరించుకుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ఈ ఉదయం గేట్లను ఎత్తివేశారు అధికారులు. సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. నైరుతి రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా నది దిగువ భాగానికి నీరు వదలడం ఇదే మొదటిసారి. ఇటీవల కురిసిన వర్షాల ప్రభావంతో స్థానిక పరివాహక ప్రాంతాల నుంచి బ్యారేజీకి వచ్చే నీటి ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో అదనపు నీటిని పరిమితంగా విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నారు.కృష్ణా సెంట్రల్ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య నాలుగు గేట్లు ఎత్తారు. ఆ సమయంలో దిగువకు సుమారు 2,000 నుంచి 3,000 క్యూసెక్కుల మధ్య నీటిని విడుదల చేసినట్లు పేర్కొన్నారు. వాస్తవంగా విడుదలైన నీటి పరిమాణం సుమారు 2,900 క్యూసెక్కులుగా నమోదైంది. స్థానిక క్యాచ్‌మెంట్ ప్రాంతాల నుంచి ఇన్‌ఫ్లో పెరగడంతో మిగులు నీటిని వదిలినట్లు వివరించారు.ప్రకాశం బ్యారేజీ ఎగువ, దిగువ ప్రాంతాల్లో కృష్ణా నది ఒడ్డున ఉన్న ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. సంబంధిత శాఖల అధికారులకు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నీటి విడుదల తక్కువ పరిమాణంలోనే ఉన్నప్పటికీ, ప్రవాహం పెరిగే పరిస్థితులు ఉంటే ముందస్తు జాగ్రత్తలు అవసరమని అధికారులు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి విడుదల దృశ్యాలను చూసేందుకు వచ్చిన సందర్శకులు బ్యారేజీ పరిసరాల్లో నిలిచారు.కాగా.. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నేడు ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అన్నారు. ప్రత్యేకించి శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అన్నారు.