
నవ దంపతుల్ని అందంగా అలంకరించిన పూల సప్తపది మీద నడిపించడం చూసుంటారు. కానీ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ చుట్టుపక్కల ఊళ్లలో నిప్పుల మీద నడిపిస్తారు. కొత్త జీవితంలో ఎదురయ్యే కష్టాల్ని తట్టుకుని ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ వింత ఆచారాన్ని పెట్టుకున్నారట. తాళి కట్టిన తర్వాత పట్టుబట్టల్లోనే కొత్త జంట ఈ ‘అగ్నిపరీక్ష’లో పాల్గొంటుంది. వట్టి కాళ్లతో నిప్పుల మీద నడిచినా కులదైవం అనుగ్రహం వల్ల తమకు ఏమీ కాదని బలంగా నమ్ముతారు. పెళ్లిలో అగ్నిపరీక్ష
|