
భారత యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో నిన్న జరిగిన తొలి వన్డేలో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించడమే కాకుండా, ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 3000 పరుగులు పూర్తి చేసిన భారత ఆటగాడిగా గిల్ నిలిచాడు.గిల్ తన 62వ ఇన్నింగ్స్‌లోనే ఈ మైలురాయిని అందుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు 72 ఇన్నింగ్స్‌లలో 3000 పరుగులు చేసిన శిఖర్ ధావన్ పేరిట ఉండేది. విరాట్ కోహ్లీ (75 ఇన్నింగ్స్‌లు) ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, దక్షిణాఫ్రికా దిగ్గజం హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్స్‌లు) మాత్రమే గిల్ కంటే ముందున్నాడు.వర్షం కారణంగా నాలుగు గంటలకు పైగా ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌ను 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్, గుర్బాజ్ (51 బంతుల్లో 102) మెరుపు సెంచరీతో 194 పరుగులకు ఆలౌట్ అయింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. గిల్ అద్భుతమైన బ్యాటింగ్‌తో సునాయాసంగా విజయం సాధించింది. గిల్ కేవలం 66 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 84 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లోకేశ్ రాహుల్ (19 బంతుల్లో 39 నాటౌట్) అతనికి చక్కటి సహకారం అందించాడు. దీంతో భారత్ మరో 2.3 ఓవర్లు మిగిలి ఉండగానే 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ద్వైపాక్షిక సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే బుధవారం లక్నోలో, చివరి