
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Heavy Rain Alert To Hyderabad: వేసవికాలంతో విలవిలలాడిన తెలంగాణపై వరుణుడు కరుణించాడు. వర్షాకాలం ప్రారంభమే వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో పలుమార్లు వర్షం భారీగా పడగా జిల్లాల్లోనూ అదే పరిస్థితి కొనసాగుతోంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో వర్షాలు జోరుగా పడుతున్నాయి. ఆదివారం కూడా అంటే జూన్ 14వ తేదీన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తోపాటు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ సందర్భంగా పలు జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా, మేడ్చల్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. సిద్ధిపేట, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది. మిగిలిన జిల్లాల్లో కూడా వర్షాలు పడే అవకాలున్నాయని వాతావరణ శాఖ వివరించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షాలు పడే జిల్లాల్లో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచనలు చేసింది. మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా.. నాలుగో రోజు కూడా కురవనుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక రాజధాని హైదరాబాద్‌లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. ఉదయం నుంచి వాతావరణం చల్లగా ఉండగా.. సాయంత్రం వర్షం దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వం అప్రమత్తం కాగా ఇప్పటికే వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం ప్రకటించింది. భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రమత్తమై అధికార యంత్రాంగానికి
కీలక ఆదేశాలు జారీ చేసింది. వర్షాలు పడుతున్న ప్రాంతాల్లో వెంటనే సహాయ చర్యలు ముమ్మరం చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వర్షాలతో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ శాఖకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షాలతో దాదాపు ఆరుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విద్యుత్ శాఖ నిర్లక్ష్యంతో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో అలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖకు ప్రభుత్వం ఆదేశించింది.