ధర్మశాల వేదికగా అప్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించి.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యంగ్ ఆల్ రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు. నితీశ్ విలేకరులతో మాట్లాడుతుండగా.. అతడి తల్లి ఫోన్ చేసింది. దీంతో ప్రెస్ మీట్ ఆపేసిన అతడు.. తల్లితో ఫోన్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మీడియా సమావేశంలో రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి ఫోన్ మోగింది. అమ్మ నుంచి కాల్ వచ్చిందని గుర్తించిన అతడు.. ప్రెస్ మీట్‌ను కాసేపు ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఈ విషయాన్ని విలేకరులకు చెప్పాడు. ‘అమ్మా.. 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను’ అని తెలుగులో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. అనంతరం మీడియా ప్రతినిధులకు చిరునవ్వుతో సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ‘మన తెలుగును ప్రపంచ వేదికపై హైలైట్ చేస్తున్నాడు’, ‘నితీశ్‌కు అమ్మ అంటే ఎంత ప్రేమో..’ , ‘అమ్మ నుంచి కాల్ వస్తే ఎత్తక తప్పదు మరీ’ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అఫ్ఘానిస్థాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేను వర్షం కారణంగా.. 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రంలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో సత్తాచాటారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్(84*), కేఎల్ రాహుల్(39*) రాణించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది
ధర్మశాల వేదికగా అప్ఘానిస్థాన్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్ ఘన విజయం సాధించి.. సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో టీమిండియా యంగ్ ఆల్ రౌండర్, తెలుగు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి పాల్గొన్నాడు. నితీశ్ విలేకరులతో మాట్లాడుతుండగా.. అతడి తల్లి ఫోన్ చేసింది. దీంతో ప్రెస్ మీట్ ఆపేసిన అతడు.. తల్లితో ఫోన్ మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.మీడియా సమావేశంలో రిపోర్టర్ల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్న సమయంలో నితీశ్ కుమార్ రెడ్డి ఫోన్ మోగింది. అమ్మ నుంచి కాల్ వచ్చిందని గుర్తించిన అతడు.. ప్రెస్ మీట్‌ను కాసేపు ఆపి ఫోన్ లిఫ్ట్ చేశాడు. ఈ విషయాన్ని విలేకరులకు చెప్పాడు. ‘అమ్మా.. 5 నిమిషాల్లో మళ్లీ చేస్తాను’ అని తెలుగులో మాట్లాడి ఫోన్ కట్ చేశాడు. అనంతరం మీడియా ప్రతినిధులకు చిరునవ్వుతో సారీ చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఈ వీడియో చూసిన నెటిజన్లు.. నితీశ్ కుమార్ రెడ్డిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. . ‘మన తెలుగును ప్రపంచ వేదికపై హైలైట్ చేస్తున్నాడు’, ‘నితీశ్‌కు అమ్మ అంటే ఎంత ప్రేమో..’ , ‘అమ్మ నుంచి కాల్ వస్తే ఎత్తక తప్పదు మరీ’ అని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే.. అఫ్ఘానిస్థాన్‌తో ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేను వర్షం కారణంగా.. 25 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘానిస్థాన్ జట్టు 194 పరుగులకు ఆలౌటైంది. అరంగేట్రంలోనే గుర్నూర్ బ్రార్, హర్ష్ దూబె తలో 3 వికెట్లతో సత్తాచాటారు. నితీశ్ కుమార్ రెడ్డి, అర్షదీప్ సింగ్ చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం టీమిండియా 22.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. శుభ్‌మన్ గిల్(84*), కేఎల్ రాహుల్(39*) రాణించారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.