అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు గత రెండు రోజులు భారీగా పెరిగాయి. నిన్నటి రోజున ఔన్స్ బంగారం ధర ఏకంగా 113 డాలర్లు పెరిగింది. అయితే, ఇవాళ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ రేటు 4210 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు ప్రస్తుతం 67.78 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. హైదరాబాద్‌లో బంగారం ధరలు గత రెండు రోజులు భారీగా పెరిగి ఇవాళ స్థిరంగా ఉన్నాయి. ఇవాళ 24 క్యారెట్ల బంగారం రేటు ఏ మార్పు లేకుండా 10 గ్రాములకు రూ.1,49,080 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,36, 650 వద్ద అమ్ముడవుతోంది. బంగారంతో పాటు వెండి ధరలు సైతం ఈరోజు స్థిరంగానే ఉన్నాయి. గత రెండు రోజుల్లో కిలో వెండి ధర రూ.10 వేల మేర పెరగగా ఇవాళ అదే ధర వద్ద స్థిరంగా ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో కిలో వెండి రేటు రూ.2,70,000 మార్క్ వద్ద అమ్ముడవుతోంది. ఈరోజు మార్కెట్‌కు సెలవు కాబట్టి లలితా జువెలరీ వంటి ప్రముఖ జువెలరీ సంస్థల్లోనూ బంగారం ధరలు స్థిరంగానే ఉంటాయి. ప్రస్తుతం లలితా జువెలరీలో 22 క్యారెట్ల పసిడి ధర 1 గ్రాముకు రూ.13,665 వద్ద ఉంది. అలాగే 10 గ్రాములకు ధర చూసుకుంటే రూ.1,36,650 వద్ద ట్రేడవుతోంది. రచయిత గురించిబండ తిరుపతిబండ తిరుపతి సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. 2023లో సమయంలో చేరిన తిరుపతి.. బిజినెస్ రంగానికి సంబంధించి తాజా వార్తలతో పాటు పర్సనల్ ఫైనాన్స్, పెట్టుబడులు, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ న్యూస్, బంగారం వెండి ధరలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు అందిస్తున్నారు. ఫ్యాక్ట్ చెక్ ఆర్టికల్స్‌తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారం సైతం ఇస్తున్నారు. బండ తిరుపతి 2025 ఫిబ్రవరిలో టైమ్స్
ఇంటర్నెట్ నుంచి ఓవర్ అచీవర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. తిరుపతి మండలస్థాయి న్యూస్ కంట్రిబ్యూటర్‌గా తన జర్నలిజం కెరీర్‌ను ప్రారంభించారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో మల్టీమీడియా జర్నలిజం కోర్స్ పూర్తి చేశారు. అనంతరం ఈటీవీ భారత్, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. అక్కడ బిజినెస్, స్పోర్ట్స్, నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ రాశారు. 2019 సాధారణ ఎన్నికల సమయంలో ప్రత్యేక కథనాలు అందించిన అనుభవం ఉంది. సినిమాలు, క్రికెట్ చూడటం, బిజినెస్ రంగానికి సంబంధించిన కొత్త విషయాలు నేర్చుకోవడం పట్ల ఆయన ఆసక్తి చూపుతారు.... ఇంకా చదవండి