
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల విషయంలో కాస్త తర్జన భర్జనలు నడుస్తున్నాయి. గతంలో అధికారికంగా ప్రకటించిన రెండు భారీ చిత్రాలు ఆగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని ఫిలింనగర్ వర్గాల సమాచారం. వీటికి బదులుగా, మోస్ట్ అవేటెడ్ సీక్వల్ ‘OG 2′ అనూహ్యంగా ముందుకు వచ్చింది. దీనివల్ల ఇద్దరు స్టార్ డైరెక్టర్ల ప్రాజెక్టులు ఇబ్బందుల్లో పడినట్లు తెలుస్తోంది. వాస్తవంగా పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ సినిమా స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేయాల్సి ఉంది. రామ్ తాళ్లూరి నిర్మాతగా ఈ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే అనౌన్స్ అయ్యింది. అయితే ఈ సినిమా ఇప్పటికీ స్క్రిప్ట్ దశలోనే ఉండటం సరైన క్లారిటీ లేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ ప్రస్తుతానికి పక్కకు పెట్టినట్టు సమాచారం. మరోవైపు ‘OG’ తర్వాత దర్శకుడు సుజిత్.. నాచురల్ స్టార్ నాని కథానాయకుడిగా ‘బ్లడీ రోమియో’ అనే చిత్రాన్ని చేయాల్సి ఉంది. కానీ నాని ప్రస్తుతం చేస్తున్న ‘ది పారడైస్’ మూవీ డిలే కావడంతో, ‘బ్లడీ రోమియో‘ వెనక్కి వెళ్లిపోయింది. ఈ గ్యాప్‌ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్న మేకర్స్ ముందుగా ‘OG 2’ చిత్రాన్ని పట్టాలెక్కించేందుకు మొగ్గు చూపుతున్నారట. పవన్ కళ్యాణ్ కూడా ఈ సీక్వల్ కథపై చాలా ఆసక్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. వినిపిస్తున్న సమాచారం ప్రకారం ‘OG 2’ కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు ఇప్పటికే మొదలయ్యాయి. అంతా అనుకున్నట్లు జరిగితేఈ ఏడాది సెప్టెంబర్‌లో అందుకు సంబంధించి అధికారిక అనౌన్స్మెంట్ రానుంది. అలాగే నవంబర్ నుంచి షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 చివరి నాటికి థియేటర్లలోకి తీసుకురావడమే లక్ష్యంగా మూవీ టీం ప్లాన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ‘OG 2’ తర్వాత సురేందర్ రెడ్డి సినిమా ఉంటుందా లేదా అనేది ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది
.