
అమరావతి: వేగంగా దూసుకెళ్తున్న అమరావతి నిర్మాణం ఇక తగ్గేదే లేదంటూ మంత్రి నారా లోకేశ్ వీడియో పోస్ట్ చేశారు. వర్షంలోనూ అమరావతి నిర్మాణం ఆన్ స్టాపబుల్ అన్నారు. రాజధానికి ఇక బ్రేకులు పడేదే లేదని స్పష్టం చేశారు. అమరావతి నిర్మాణం టాప్ గేర్లో ఉందని వెల్లడించారు. ఎక్కడా వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నట్లుగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. వర్షం పడితే అమరావతి మునిగిందంటూ ట్రోల్ చేసే వారికి సారీ బ్రో అంటూ లోకేశ్ సెటైర్లు వేశారు. ట్రోల్ చేసే వారి కష్టాన్ని గుర్తించి.. వర్షం పడినా ఏ సైట్లోనూ పనులు ఆగట్లేదని చాటేందుకే ఈ వీడియో అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇకనైనా విషం ప్రచారం కట్టిపెట్టాలని హితవు పలికారు. అమరావతి ప్రయాణంలో ఇక ‘పాజ్’ అనే మాటకు తావులేదని స్పష్టం చేశారు. స్పీడ్ పెంచిన అమరావతి... నవ్యాంధ్ర భవిష్యత్తుకు అసలైన గ్యారంటీ అంటూ లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.