
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Ap Cm Chandrababu Singapore Visit: సీఎం చంద్రబాబు రెండు రోజుల పాటు సింగపూర్‌లో పర్యటించనున్నారు. ఈరోజు ఉదయం 11.35 గంటలకు బెంగళూరు నుంచి సీఎం సింగపూర్ బయల్దేరి వెళ్లనున్నారు. సింగపూర్ చేరుకున్న అనంతరం 15వ తేదీన అక్కడి కాలమానం ప్రకారం..
ఉదయం 10.30 గంటలకు ఆ దేశంలోని భారత హై కమిషనర్ శిల్పక్ అంబులేతో మొదటగా ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. అనంతరం వరుసగా పలు అంతర్జాతీయ పారిశ్రామిక సంస్థల ప్రతినిధులు, పెట్టుబడిదారులతో సీఎం చంద్రబాబు రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటారు.
ఆ తర్వాత రాజధాని అమరావతి రెండో దశ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ రూపొందిస్తున్న 'సుర్బానా-జురాంగ్' ప్రతినిధులతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. అలాగే గూగుల్ క్లౌడ్ ఆసియా పసిఫిక్ అధ్యక్షుడు కరణ్ బజ్వా, యూఎన్ హాబిటాట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనాక్లాడియా రాస్బాచ్, సింగపూర్ సీనియర్ మంత్రి లీ యెన్ లింగ్ సహా పలువురు గ్లోబల్ లీడర్లతో చంద్రబాబు సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించనున్నారు.
అలాగే సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో కూడా సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌తో ఆర్థిక, సాంకేతిక భాగస్వామ్యాలపై చర్చించనున్నారు. మరోవైపు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్, హోం మంత్రి కె.
షణ్ముగం, మానవ వనరుల శాఖ మంత్రి టాన్ సీ లెంగ్లతో కూడా ఏపీ ప్రతినిధి బృందం సమావేశం కానుంది. ఇక పర్యటనలో రెండో రోజైన జూన్ 16న ఉదయం కాకతీయ కల్చరల్ అసోసియేషన్ నిర్వహించే 'సీటీఎస్@361' కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు.
సిఐఐ భాగస్వామ్యంతో నిర్వహించే 'బిజినెస్ రోడ్ షో-2026'లో పాల్గొని ఏపీ బ్రాండ్ ఇమేజ్ను గ్లోబల్ ఇన్వెస్టర్లకు పరిచయం చేయనున్నారు సీఎం. 16వ తేదీ రాత్రి 10 గంటలకు సీఎం చంద్రబాబు తిరిగి స్వదేశానికి చేరుకుంటారు. ఈ పర్యటనకు సీఎం చంద్రబాబు వెంట పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్, ఈడీబీ సీఈఓ షార్జిల్హాన్, సీఆర్డీఏ ఉన్నతాధికారుల బృందం వెళ్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆ తర్వాత 'వరల్డ్ సిటీస్ సమిట్' లీడర్షిప్ ప్లీనరీలో ప్రత్యేక ప్రసంగం చేస్తారు. చివరగా