
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. AP Weather Alert: ఏపీ ప్రజలకు కీలక హెచ్చరిక. నైరుతి రుతుపవనాలు, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో రాష్ట్రం నేడు మేఘావృతంగా వాతావరణం మారిపోతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఈరోజు భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లో పిడుగులతో కూడిన ఈదురు గాలులు, మోస్తారు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు భారత వాతావరణ శాఖ ఒక ప్రకటనలో వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాలు పడనున్నాయి. ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కూడా హెచ్చరించింది. చెట్లు, భారీ హోర్డింగ్స్ కింద ఎవరూ నిలబడవద్దని సూచనలు చేసింది. పిడుగుల పడే సమయంలో రైతులు, పశుకాపరులు జాగ్రత్తలు పాటించాలని సూచించింది. అంతేకాదు.. విద్యుత్ వైర్లు తెగిపడితే దూరంగా ఉండాలని హెచ్చరించింది. ఇప్పటికే మార్కాపురం జిల్లా కోవిలంపాడులో 41 మి.మీ వర్షపాతం నమోదు కాగా, అనంతపురం తెరన్నపల్లిలో 24 మి.మీ వర్షం, కడప జిల్లా సింహాద్రిపురంలో 22.5 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏపీలో వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్ డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ సూచనలు చేశారు. స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
.