
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. India Tour Of Zimbabwe: మీడియా రంగంలో అగ్రగామి సంస్థగా ఉన్న జీ మీడియా క్రీడా రంగంలోనూ సత్తా చాటుతోంది. అంతర్జాతీయ క్రీడా టోర్నీల ప్రసార హక్కులను వరుసగా జీ మీడియా సంస్థ సొంతం చేసుకుంటోంది. ఇప్పటికే ఫిఫా ప్రపంచకప్ 2026తో సత్తా చాటిన జీ మీడియా తాజాగా క్రికెట్లోనూ ఎంట్రీ ఇచ్చింది. జింబాబ్వేతో జరగనున్న టీ20 సిరీస్ ప్రసార హక్కులను జీ మీడియా సంస్థ దక్కించుకుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. క్రీడా రంగంలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటూ జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ మరో భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. 2026 జూలైలో జరగబోయే భారత క్రికెట్ జట్టు జింబాబ్వే పర్యటనకు సంబంధించిన ప్రత్యేక అధికారిక ప్రసార హక్కులను జీ మీడియా సొంతం చేసుకుంది. ఈ ఒప్పందంతో జీ నెట్వర్క్ స్పోర్ట్స్ విభాగం యునైట్8 స్పోర్ట్స్ ఛానెళ్లలో ప్రసారాలు జరగుతాయి. ట్వంటీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది వీక్షకులు ప్రత్యేకంగా వీక్షించనున్నారు. సిరీస్ ఎప్పుడు భారత్ వర్సెస్ జింబాబ్వే టీ20 సిరీస్ జూలై 2026లో జరగనుంది. ఈ మ్యాచ్‌లు 'యునైట్8 స్పోర్ట్స్' ఛానెళ్లలో మాత్రమే ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. జింబాబ్వే క్రికెట్ చరిత్రలోనే అత్యంత పెద్ద అంతర్జాతీయ సిరీస్‌లలో ఒకటైన ఈ టూర్‌ను టీవీ ద్వారా కోట్ల మంది ప్రేక్షకులకు సంస్థ అందుబాటులో రానున్నాయి. ఇప్పటికే IL T20, ఫిఫా వరల్డ్ కప్ 2026 వంటి ప్రతిష్టాత్మక టోర్నమెంట్ల హక్కులను కలిగి ఉన్న జీ మీడియా ఇప్పుడు భారత్-జింబాబ్వే సిరీస్‌తో క్రీడా విభాగంలో మరింత పటిష్టం చేసుకుంది. ప్రసారాలు
ఎక్కడ? నిరంతరం వార్తా ప్రసారాలు చేస్తున్న జీ మీడియా క్రీడా రంగానికి కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. యునైట్ 8 స్పోర్ట్స్ చానల్స్‌తో జింబాబ్వే సిరీస్ మ్యాచ్‌లు తెరపైకి రానున్నాయి. క్రికెట్ అభిమానుల వినోదాన్ని రెట్టింపు చేస్తూ ఈ మ్యాచ్‌లు వివిధ భాషల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. దీంతోపాటు ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ లు కూడా చూసే అవకాశం లభిస్తోంది.
హిందీ యునైట్8 స్పోర్ట్స్ 1, యునైట్8 స్పోర్ట్స్ 1 హెచ్డీ చానల్స్‌లో ప్రత్యక్షప్రసారం ఇంగ్లీష్ భాష: యునైట్8 స్పోర్ట్స్ 2, యునైట్8 స్పోర్ట్స్ 2,
ఇదొక కీలక అడుగు జింబాబ్వే, భారత్ టీ20 సిరీస్ దక్కించుకోవడంపై జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (యునైట్8 స్పోర్ట్స్) చీఫ్ బిజినెస్ ఆఫీసర్ భవేష్ జనావ్లేకర్ స్పందించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. 'భారత్-జింబాబ్వే పర్యటనను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషాన్ని ఇస్తోంది. యునైట్8 స్పోర్ట్స్‌ను ప్రపంచస్థాయి ప్రీమియం క్రీడలకు ఒక ప్రధాన వేదికగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో ఇదొక కీలక అడుగు' అని భవేష్ జనావ్లేకర్ తెలిపారు. విభిన్నమైన క్రీడా కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించాలనే తమ వ్యూహానికి ఈ ఒప్పందం అద్దం పడుతోందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మా ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా సరికొత్త, ఆకట్టుకునే క్రీడా వినోదాన్ని అందిస్తూనే ఉంటామని పేర్కొన్నారు. జింబాబ్వే క్రికెట్‌తో సుదీర్ఘ భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.