
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tuni Girl Missing Case Search Operation: తల్లిదండ్రులు పొలం వద్ద కాపలా కాస్తుండగా.. తమ పెంపుడు కుక్కతో కలిసి ఇంటి వద్ద ఆడుకుంటున్న బాలిక పొలంలోకి వెళ్లి అదృశ్యమైంది. అటవీ ప్రాంతంలోకి వెళ్లిన బాలిక ఆచూకీ వారమైనా లభించలేదు. మూడు రోజుల కనిపించిన పెంపుడు కుక్క అనూహ్యంగా మృతి చెందడంతో ఈ ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. ఏపీలో తీవ్ర సంచలనం రేపుతున్న బాలిక అదృశ్యంపై జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు. వెంటనే బాలిక ఆచూకీ తెలుసుకోవాలని అధికార యంత్రాంగానికి ఆదేశించారు. తుని ప్రాంతంలో చిన్నారి అదృశ్యం ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. బాలిక ఆచూకీ కనిపెట్టేందుకు చేపట్టిన చర్యలపై చర్చించారు. కాకినాడ జిల్లా, తుని మండల పరిధిలోని సీహెచ్ అగ్రహారంలో వారం రోజుల కిందట అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ త్వరితగతిన కనుగొనేందుకు మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు. బాలిక జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం ప్రస్తుతం గాలింపు చర్యల్లో ఉన్న పోలీసు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలతోపాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సేవలు కూడా వినిగియోగించుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సూచించారు. దట్టమైన అడవుల్లోకి కూడా వెళ్లే సత్తా ఉన్న అటవీశాఖ నైట్ వాచర్స్, బేస్ క్యాంప్ వాచర్స్, నిపుణుల సహాయం తీసుకుని పరిసర అటవీ ప్రాంతాల్లో జల్లెడ పట్టాలని ఆదేశించారు. చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం ఘటనపై శనివారం మరోసారి కాకినాడ జిల్లా ఎస్పీతో ఫోన్లో సమీక్షించారు. ఇప్పటికే
పలుమార్లు ఈ అంశంపై పోలీసు ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి మాట్లాడారు. బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఇప్పటికే 400 మందికిపైగా సిబ్బంది గాలింపు చర్యల్లో పాల్గొంటున్నట్టు, అత్యాధునిక డ్రోన్లతో అణువణువు జల్లెడ పడుతున్నట్టు కాకినాడ ఎస్పీ వివరించారు. చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి పరిసరాల్లో 38 సీసీ కెమెరాల్లో ఫుటేజీని పరిశీలించినట్టు తెలిపారు. చిన్నారి అదృశ్యమై వారం రోజులు గడచిన క్రమంలో దర్యాప్తు మరింత వేగవంతం చేయాలని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశించారు.
పెంపుడు కుక్క మృతి అదృశ్యమైన చిన్నారి జాహ్నవి కేసులో కీలకమైన పెంపుడు కుక్క కొద్ది సేపటి కిందట చనిపోయింది. ఉన్న ఒక్క సాక్ష్యం కనుమరుగైపోయింది. దానిపైన ఆశలు పెట్టుకున్న చిన్నారి తల్లిదండ్రులు గణేశ్, భవాని కన్నీరు మున్నీరవుతున్నారు. తమ పాప పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కరాటే కల్యాణి పరామర్శ అదృశ్యమైన చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని సినీ నటి కరాటే కల్యాణి పరామర్శించారు. అమావాస్య సందర్భంగా బాలికను బలిచ్చేందుకు ఎవరో అపహరించి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఏదో మిస్టరీ ఉందని.. దీనిని ఛేదించాలని కరాటే కల్యాణి పోలీసులను కోరారు.