
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Post Office Vikas Patra Scheme: పోస్ట్ ఆఫీస్ పలు ఆర్థిక స్కీమ్స్ ను కూడా ప్రవేశపెడుతోంది. వీటిలో డబ్బులను పొదుపు లేదా మదుపు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ పోస్టాఫీస్ స్కీముల్లో ఎక్కువగా సేఫ్ అండ్ సెక్యూర్ భరోసా ఉన్న నేపథ్యంలోనే ప్రజలు ఈ స్కీముల్లో డబ్బులు దాచుకునేందుకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
మనదేశంలో పోస్ట్ ఆఫీస్ లో డబ్బు దాచుకునేందుకు జనం ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అందుకు ప్రధాన కారణం పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ పై భారత ప్రభుత్వం భరోసా కల్పించడమే ప్రధాన కారణమని చెప్పాలి. అంతేకాదు గ్రామీణ ప్రాంతాలు, బ్యాంకింగ్ రంగం విస్తరించిన ప్రాంతాల్లో కూడా పోస్ట్ ఆఫీస్ సేవలు అందిస్తుంది.
కాబట్టి ప్రజలు తమ చిన్న మొత్తాల సేవింగ్స్ కోసం పోస్ట్ ఆఫీస్ పైనే ఇప్పటికీ నమ్మకం ఉంచుతున్నారు. ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫీస్ పలు ఆర్థిక స్కీమ్స్ ను కూడా ప్రవేశపెడుతుంది. వీటిలో డబ్బులను పొదుపు లేదా మధు చేసేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు.
జనం ముఖ్యంగా ఎక్కువగా సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉన్న నేపథ్యంలోనే ప్రజలు పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో డబ్బులు ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే అలాంటి ఒక ప్రధాన స్కీం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ స్కీం లో మీరు డబ్బులు దాచుకోవడం ద్వారా మీరు దాచుకున్న డబ్బు రెట్టింపు అవుతుంది.
అలాంటి స్కీమ్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే కిసాన్ వికాస్ పాత్ర స్కీము. ఈ స్కీమ్ మీ డబ్బుకు భరోసా ఇచ్చి మీ ఇన్వెస్ట్మెంట్లను రెట్టింపు చేసే అత్యంత ప్రజాదరణ పొందిన పోస్ట్
ఆఫీస్ పొదుపు స్కీమ్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ స్కీమ్ లో అత్యంత ఆకర్షణమైన విషయం ఏంటంటే మీరు పెట్టుబడి పెట్టిన డబ్బు 115 నెలల తర్వాత కచ్చితంగా రెట్టింపు అయ్యి మెచ్యూరిటీ సమయానికి లభిస్తుంది.
అంటే 9 సంవత్సరాల 7 నెలల కాలవ్యవధిలో మీ డబ్బు రెట్టింపు అవుతుంది. ప్రస్తుతం ఈ స్కీము పై 7.5శాతం వడ్డీ లభిస్తుంది. అంతేకాదు మీరు కనీసం 1000 ఇన్వెస్ట్‌మెంట్‌తో ఈ స్కీమ్ ప్రారంభించవచ్చు. గరిష్టంగా ఎలాంటి పరిమితి లేదన్న సంగతిని గుర్తుంచుకోవాలి. మీరు 50 వేల రూపాయల కంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నట్లయితే పాన్ కార్డు జారీ చేయడం అనేది తప్పనిసరి. అలాగే 10 లక్షల రూపాయల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టేవారు తమ ఆదాయ ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ స్కీమ్ అత్యంత ముఖ్యమైన అర్హతల విషయానికి వస్తే 18 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరులు ఎవరైనా ఈ ఖాతాను తెరవచ్చు. ముగ్గురు వ్యక్తులు కలిసి ఒక జాయింట్ అకౌంట్ కూడా తీసుకోవచ్చు. మైనర్ పేరుతో ఒకవేళ ఈ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే వారి తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పేరుతో కూడా అకౌంట్ తీసుకోవచ్చు. ఈ మీరు ఈ కేవీపీ సర్టిఫికెట్‌ను బ్యాంకులో సెక్యూరిటీగా ఉంచే లోన్ కూడా తీసుకోవచ్చు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.