
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Rahmanullah Gurbaz Record Century: టెస్టుల్లో భారీ విజయం సాధించిన భారత జట్టు అఫ్ఘానిస్తాన్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో బౌలర్లు చెలరేగిపోయారు. వర్షం కారణంగా 25 ఓవర్లకు కుదించగా.. పూర్తి ఓవర్లు కూడా ఆడలేక చేతులెత్తేశారు. అఫ్ఘాన్ బ్యాటర్లపై బౌలర్లు ప్రతాపం చూపించారు. ఆరంభ మ్యాచ్ లోనే యువ బౌలర్లు మూడేసి వికెట్లతో అదరగొట్టారు. భారత బౌలింగ్‌ను తట్టుకుని నిలబడిన రహహ్మనుల్లా గుర్బాజ్ దూకుడుగా ఆడి తక్కువ బంతుల్లోనే రికార్డు సెంచరీ నమోదు చేశాడు. ధర్మశాల వేదికగా జరిగిన తొలి వన్డేకు వర్షం అంతరాయం కలిగించింది. వరుణుడు శాంతించిన అనంతరం రిఫరీలు 25 ఓవర్లకు కుదించారు. టాస్ నెగ్గిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘానిస్థాన్ 24.5 ఓవర్లకు 194 పరుగులు చేసి ఆలౌటైంది. అఫ్ఘాన్ బ్యాటర్లలో రహ్మనుల్లా మినహా ఎవరూ ఝుళిపించలేకపోయారు. బ్యాటర్లు బ్యాట్ కదిలించడంలో పూర్తిగా విఫలమయ్యారు. ఇబ్రహీం జద్రాన్ (1), సిద్దీఖుల్లా అటల్ (0), రహ్మత్ షా (3), మహ్మద్ నబీ (9), రషీద్ ఖాన్ (9), అల్లా ఘజాన్ఫర్ (0), జియార్ రహ్మన్ (4) డబుల్ డిజిట్ పరుగులు కూడా సాధించలేకపోయారు. వరుసగా బ్యాటర్లందరూ ఔటవుతున్న వేళ రహ్మనుల్లా గొప్పగా ఆడాడు. మైదానంలో నిలబడి అతి తక్కువ బంతుల్లోనే శతకాన్ని నమోదు చేశాడు. బ్యాట్‌తో దూకుడుగా ఆడి 51 బంతుల్లో వేగంగా 102 పరుగులు చేశాడు. 8 ఫోర్లు, 8 సిక్సర్లు నమోదు చేశాడు. మైదానంలోకి వచ్చిన ప్రతి ఆటగాడు అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. టెస్టుల్లో పరువు పోవడంతో వన్డేలో అయినా నిలకడగా ఆడాలనే తపనతో గుర్బాజ్ పోరాడాడు
. గుర్బాజ్ ఔటయిన తర్వాత వరుసగా ఔటవడంతో ఒక బంతి మిగిలుండగానే ఆలౌటైంది.
బౌలర్ల ప్రతాపం అఫ్ఘానిస్థాన్‌పై భారత బౌలర్లు అద్భుతంగా వేశారు. టెస్టుల్లో మాదిరి వన్డేలో కూడా చెలరేగి బంతులు వేశారు. హర్ష్ దూబే, గుర్నూర్ బ్రార్‌తోపాటు మిగతా బౌలర్లు పొదుపుగా వేసి వికెట్లు పడగొట్టారు. అరంగేట్ర మ్యాచ్‌లోనే హర్ష్ దూబే, గుర్నూర్ మూడు వికెట్లు తీసి ఔరా అనిపించారు. సీనియర్ బౌలర్లు అర్ష్‌దీప్, నితీశ్ కుమార్ రెడ్డి తలా రెండు వికెట్లు తీసి రాణించారు. ఫీల్డింగ్‌లోనూ ఆటగాళ్లు అదరగొట్టారు.
రోహిత్ శర్మ రికార్డు ఈ వన్డే మ్యాచ్‌తో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశాడు. భారత జట్టు తరపున వన్డేల్లో ఆడిన అతిపెద్ద వయస్కుడిగా ఘనత సాధించాడు. రోహిత్ వయసు ప్రస్తుతం 39 సంవత్సరాల 44 రోజులు. గతంలో మాజీ ప్లేయర్ మోహిందర్ అమర్నాథ్ రికార్డును రోహిత్ శర్మ బ్రేక్ చేశాడు.