
Ashok Leyland Donates Heavy Truck To Tirumala: తిరుమల ఆలయానికి ప్రముఖ వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ విరాళాన్ని సమర్పించింది. రూ.31 లక్షలకు పైగా విలువైన అధునాతన ట్రక్కును టీటీడీకి విరాళంగా అందజేసింది. శనివారం తిరుమలలో ఈ వాహనానికి శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం అశోక్ లేలాండ్ సంస్థ ప్రెసిడెంట్ సంజీవ్ కుమార్ టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి ట్రక్కు తాళాలను అందజేశారు
.