
Supriya Sule: మహారాష్ట్ర రాజకీయ వర్గాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఎన్సీపీ (శరద్ పవార్ వర్గం) విలీన వార్తలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ సుప్రియా సూలే స్పష్టతనిచ్చారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలను ఆమె పూర్తిగా కొట్టిపారేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నుండి తమకు ఎలాంటి విలీన ప్రతిపాదనలు రాలేదని, తమ వైపు నుండి కూడా అలాంటి ప్రయత్నాలేవీ జరగడం లేదని ఆమె తేల్చి చెప్పారు. అసలు ఈ తరహా ప్రచారం ఎక్కడి నుండి పుట్టుకొచ్చిందో కూడా తనకు అర్థం కావడం లేదన్నారు. పార్టీ అధినేత శరద్ పవార్‌కు సైతం ఈ విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం నుండి ఎటువంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. Read also: UP Crime: ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై కత్తితో దాడి.. యువతి మృతి ఇటీవల కాలంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మధ్య జరిగిన సమావేశం తర్వాత జాతీయ రాజకీయాల్లో విలీనాలపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. దీనిపై సుప్రియా సూలే స్పందిస్తూ.. ఆ ఇద్దరు నేతల మధ్య జరిగిన వ్యక్తిగత భేటీలో ఏయే అంశాలు చర్చకు వచ్చాయనేది తనకు తెలియదన్నారు. ఆ సమావేశంలో వారు మాత్రమే ఉన్నందున, అక్కడ విలీన ప్రక్రియల గురించి మాట్లాడారా లేదా అనే దానిపై తనకు ఎలాంటి సమాచారం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత తరుణంలో రాజకీయ సమీకరణాల కంటే దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపైనే దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సుప్రియా సూలే అభిప్రాయపడ్డారు. దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, అవినీతి మరియు ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పరీక్ష పేపర్ లీకేజీల వంటి అంశాలు విద్యార్థుల, సాధారణ ప్రజల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజకీయ లబ్ధి
కోసం కాకుండా, ప్రజా సమస్యల పరిష్కారానికే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు.
మహారాష్ట్రలోని అధికార కూటమిపై విమర్శలు గుప్పిస్తూ.. నిత్యావసర ధరల పెరుగుదల, ఉపాధి లేకపోవడంతో రైతులు, సామాన్యులు అల్లాడిపోతున్నారని సుప్రియా సూలే మండిపడ్డారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు అండగా నిలవడమే తమ పార్టీ ముఖ్య ఉద్దేశమన్నారు. వేరే కుటుంబాలను విచ్ఛిన్నం చేయడం, ఇతర రాజకీయ పార్టీలను చీల్చడం వంటి చౌకబారు రాజకీయాలు తమ డిక్షనరీలోనే లేవంటూ ఆమె ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చారు.
IND vs AFG: భారత్ -ఆఫ్ఘనిస్థాన్ తొలి వన్డే..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
UP Crime: ప్రేమ పెళ్లి చేసుకుందని కన్న కూతురిపై కత్తితో దాడి.. యువతి మృతి
Lt General Dheeraj Seth: ఇండియన్ ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ ధీరజ్ సేథ్
Four Maoists granted bail: విజయవాడలో అరెస్టైన నలుగురు మావోయిస్టులకు బెయిల్!
Lyaki Freedom Ship Attack: ‘లియాకి ఫ్రీడమ్’ నౌకపై దాడి జరగలేదు.. విదేశాంగ శాఖ స్పష్టత
Dundigal Air Force Academy : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ గ్రాడ్యుయేషన్ పెరేడ్ లో పాల్గొన్నరాజ్నాథ్
Nestle india response: మ్యాగీలో పురుగులు? .. సోషల్ మీడియా పోస్ట్‌పై స్పందించిన నెస్లే ఇండియా