
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Drishyam 3 OTT Streaming on amazon Prime Video: మోహన్‌లాల్.. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత.. స్టోరీ నచ్చితే చాలు ఎలాంటి కథలోనైనా నటించడం మోహన్‌లాల్ స్పెషాలిటీ.
తాజాగా ఈయన లీడ్ రోల్లో యాక్ట్ చేసిన చిత్రం ‘దృశ్యం 3’. దృశ్యం, దృశ్యం 2లకు కొనసాగింపుగా తెరకెక్కిన ఈ సినిమా గత నెల విడుదలై మిక్స్డ్ టాక్‌తో భారీ వసూళ్లను సాధించింది. ఈ సినిమాను మోహన్‌లాల్ స్వయంగా నిర్మాత కావడంతో తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను సాధించింది.
అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా రూ. 300 కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను రాబట్టి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ మల్లూవుడ్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమా ఈ ననెల 18 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ 4 భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో ఒకటైన ‘దృశ్యం’ సిరీస్ మూడో భాగం ‘దృశ్యం 3’ చిత్రాన్ని జీతూ జోసెఫ్ రచన, దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ఆంథోనీ పెరుంబవూర్ నిర్మించగా, మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్ కీలక పాత్రల్లో యాక్ట్ చేశారు.
‘దృశ్యం 2’ సంఘటనల తర్వాత జార్జ్‌కుట్టి తన ఫ్యామిలీకి సంబంధించి మంచి భవిష్యత్తు ఉండాలని తపన పడతాడు. తన గత అనుభవాలను ఆధారంగా చేసుకుని ఒక విజయవంతమైన సినిమాను తెరకెక్కిస్తాడు. అయితే గతం మళ్లీ
అతడిని వెంటాడుతుంది. ఆ సినిమా వెనుక ఉన్న నిజాలను వెలికితీయడానికి ఇద్దరు జర్నలిస్టులు ప్రయత్నించగా, కుమార్తె అంజూకు వచ్చిన మ్యారేజ్ ప్రపోజల్ విషయంలో పెద్ద చిక్కొచ్చి పడుతుంది.
పాత శత్రువులు కొత్త ఉద్దేశాలతో తిరిగి రంగంలోకి దిగడంతో జార్డ్ కుట్టీ వారిపై ఎలాంటి విజయం సాధించాడు. ఈ క్రమంలో తన కుటుంబాన్ని తిరిగి ఎలా నిలబెట్టుకున్నాడనే అంశం ఆద్యంతం ఆసక్తికరంగా సాగిపోతుంది.సస్పెన్స్, భావోద్వేగాలు, ఉత్కంఠభరిత మలుపులతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు మరోసారి అద్భుతమైన థ్రిల్లర్ అనుభూతిని ప్రైమ్ వీడియోలో అందించనుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.