
ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న భారత సంతతి క్రికెటర్ కొవిడ్-19 వల్ల మారిపోయిన నిఖిల్ చౌదరి జీవితం Nikhil Chaudhary : కొవిడ్ మహమ్మారి ఎందరి జీవితాలనో చిన్నాభిన్నం చేసింది
. అయితే.. కొందరికి మాత్రం అనుకోని విధంగా అదృష్టాన్ని తీసుకువచ్చింది. అలాంటి వారిలో భారత సంతతి క్రికెటర్ నిఖిల్ చౌదరి ఒకరు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా నిఖిల్ జీవితం అనుకోని మలుపు తిరిగింది. కట్ చేస్తే ఆస్ట్రేలియా జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నాడు 30 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్. ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి చాలా కాలం పాటు భారత్‌లోనే ఉన్నాడు. టీమ్ఇండియాకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కన్నాడు. ఈ క్రమంలో దేశవాళీలో పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తూ సయ్యద్ ముస్తాక్ అలీ, విజయ్ హజారే వంటి టోర్నీలను సైతం ఆడాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నెట్ బౌలర్‌గానూ సేవలందించాడు. *Vaibhav Sooryavanshi : ఇదేం ఫ్యామిలీరా అయ్యా.. వైభవ్ సూర్యవంశీనే కాదు అతడి తమ్ముడు కూడా.. 10 ఏళ్లకే సెంచరీ.. అయితే.. 2020లో అతడి జీవితం ఊహించని మలుపు తిరిగింది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉంటున్న బంధువులను చూసేందుకు వెళ్లాడు. సరిగ్గా అదే సమయంలో కొవిడ్-19 విజృంభించడంతో ప్రపంచ వ్యాప్తంగా లాక్డౌన్ అమల్లోకి రావడంతో అతడు అక్కడే చిక్కుకుపోయాడు. చివరకు అక్కడే స్థిరపడిపోయాడు. ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జేమ్స్ హోప్స్ దృష్టిలో పడడం అతడికి కలిసి వచ్చింది. అతడి ప్రోత్సాహంతో ఆసీస్‌లోనే స్థానిక క్లబ్ క్రికెట్లో ఆడడం మొదలుపెట్టాడు. లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌గా తనదైన గుర్తింపు సాధించాడు. దీంతో టాస్మేనియా దేశవాళీ జట్టులో అతడికి చోటు దక్కింది. ఇక బిగ్‌బాష్ లీగ్ లోనూ తనదైన ముద్ర వేశాడు. ఇప్పటి వరకు 32 మ్యాచ్‌లు ఆడి 693 పరుగులు చేయడంతో పాటు 9 వికెట్లు పడగొట్టాడు. ఇక 2024-25 బిగ్‌బాష్ సీజన్లో హోబర్ట్ విజేతగా నిలవడంలో నిఖిల్ కీలక పాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనలతో అతడు బంగ్లాదేశ్‌లో పర్యటించే ఆసీస్ టీ20 జట్టులో చోటు దక్కించుకున్నాడు. *IND vs AFG : తొలి వన్డేకు ముందు టీమ్ఇండియా డ్రెస్సింగ్ రూమ్ సీక్రెట్స్ బయట పెట్టిన బౌలింగ్ కోచ్ మోర్కెల్ జూలై 17 నుంచి ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది.