
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Budha in Guru Nakshatram: గ్రహాల రాకుమారుడు బుధుడి సంచారం మారబోతోంది. జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తర్కం, సంభాషణ, వ్యాపార సంబంధ గ్రహంగా పరిగణిస్తారు. ప్రస్తుతం, బుధుడు ఆరుద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. బుధుడి సంచారం ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. బుధ నక్షత్ర మార్పు అన్ని రాశులపైనా ప్రభావం చూపుతుంది. త్వరలో, బుధుడు దేవ గురువు నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. బుధుడు జూన్ 11 నుంచి 2026 ఆగస్టు 8 ఉదయం వరకు ఈ నక్షత్రంలో సంచరించబోతన్నాడు. . ఈ బుధ సంచారం కొన్ని రాశుల వారికి గణనీయమైన ప్రయోజనాలను అందించబోతుంది. ఈ సంచారం సమయంలో పాటించే కొన్ని పరిహారాలు కూడా అత్యంత ప్రయోజనకరంగా ఉంటాయి. గురు నక్షత్రంలో బుధ సంచారం వల్ల ఏ రాశుల వారు ప్రయోజనం అందుకోబోతున్నారో చూద్దాం.
కొన్ని రాశుల వారు దాదాపు రెండు నెలల పాటు తమ జీవితాలలో గణనీయమైన మార్పులను అనుభవిస్తారు, బుధ సంచారం అపారమైన ప్రయోజనాలను అందించబోతుంది. ఈ 3 పరిహారాలను తప్పకుండా ప్రయత్నించండి.
కన్యా రాశి.. గురు నక్షత్రంలో బుధ సంచారం కన్యా రాశి వారి జీవితంలో కొత్త మార్పులు రాబోతున్నాయి. గురు నక్షత్రంలో బుధ సంచారం కన్యా రాశి వారికి సానుకూల ఫలితాలను అందుకుంటారు. ఈ సమయంలో విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. మీ యజమాని నుండి మీకు సంపూర్ణ మద్దతు లభిస్తుంది మీరు స్నేహితులతో మంచి సమయాన్ని గడుపుతారు. మీరు ఈ సమయంలో కొత్తగా సృజనాత్మకంగా ఆలోచించగలుగుతారు.
మిథున రాశి వారికి గురువు నక్షత్రంలో బుధ సంచారం వలన అద్భుతమైన ప్రయోజనాలను అందుకోబోతున్నారు. మిథున రాశి వారికి బృహస్పతి నక్షత్రంలో బుధ సంచారం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది. కళారంగంలో ఉన్నవారికి ఈ సమయం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. ఈ సమయంలో మీ సామాజిక సంబంధాలు పెరుగుతాయి. మతపరమైన విషయాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు పనులలో చురుకుగా పాల్గొంటారు.
సింహ రాశి.. గురు నక్షత్రంలో బుధ సంచారం సింహ రాశి వారికి అనుకోని ప్రయోజనాలతో లబ్ధి పొందబోతున్నారు. గురు నక్షత్రంలో బుధ సంచారం సింహ రాశి వారికి ప్రయోజనకరం ఉండబోతున్నట్టు గ్రహ గతులు చెబుతున్న మాట. మీరు అనుకోకుండా ఒక పెద్ద ఒప్పందం చేసుకుంటారు. మీ సంభాషణ నైపుణ్యాలు మెరుగుపడతాయి. మీరు ఒక యాత్రను కూడా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు అనేక విభిన్నమైన వినూత్న ఆలోచనలతో కొత్త అడుగులు వేస్తారు.
బుధ సంచారం వలన మీపై నర దృష్టి అధికంగా ఉండబోతుంది. ఈ సమయంలో మీరు
"ఓం బం బుధాయ నమః," "ఓం ఐం శ్రీం శ్రీం బుధాయ నమః," మరియు "ఓం బ్రం బ్రిం బ్రౌం సహ బుధాయ నమః" అనే మంత్రాలను జపించడం వలన అనేక రకాలైన ఇబ్బందులను నుండి బయటపడతారు. బుధవారాల్లో ఆకుకూరలు లేదా ధాన్యాలు దానం చేయడం కూడా బుధ గ్రహాశీస్సులను పొందుతారు. బుధ గ్రహం యొక్క అశుభ ప్రభావాలను తగ్గించడానికి, బుధవారాల్లో ఆవుకు పచ్చి మేత పెట్టాలి.
గమనిక: ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజమైనది లేదా లేదా ఖచ్చితమైనదని మేము చెప్పడం లేదు. జ్యోతిష్య శాస్త్రంలో గ్రహ గతుల ఆధారంగా పండితులు చెప్పిన అభిప్రాయాలనే మేము వెల్లడించాము. ఖచ్చితమైన సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలోని పండితులను సంప్రదించండి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.