
వీళ్లకి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే మన స్పేస్‌లోకి రాగలిగే చనువు ఉంటుంది. ‘నువ్వు ఫ్రీగా ఉన్నావా, ఇవాళ కలవొచ్చా’ వంటి మాటలు వీరిదగ్గర ఉండవు. ఏ సందర్భంలో అయినా మన పక్కన నిలబడతారు. ఎంత కష్టంలోనూ
తోడుగా ఉంటారు. వారినే డోర్‌బెల్ ఫ్రెండ్స్ అంటున్నారు. లైఫ్‌లో కనీసం ఒక్కరైనా ఇలాంటి ఫ్రెండ్ ఉండాలని కోరుకుంటున్నారు జెన్జీలు. మీకూ ఉన్నారా డోర్‌బెల్ ఫ్రెండ్స్ |