
మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో
వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Gold Rate Today: బంగారం, వెండి ధరలు గత రెండు మూడు రోజులుగా భారీగా తగ్గిన విషయం తెలిసిందే. అయితే నేడు స్వల్పంగా పెరిగాయి. అయినప్పటికీ గరిష్ట స్థాయి నుంచి ఇంకా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక 1,49540 రూపాయలు పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,37,078 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 2,41,460 రూపాయలు పలుకుతోంది. బంగారం ధరలు స్వల్పంగా పెరగడం గమనించవచ్చు. అయితే పసిడి ధరలో పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడమే కారణమని చెప్పవచ్చు. నేడు జూన్ 13వ తేదీ శనివారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం
బంగారం ధరలు జూన్ 13వ తేదీ శనివారం ఎలా ఉన్నాయంటే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,49540 పలుకుతుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒక 1,37,078 రూపాయలు పలుకుతుంది. కిలో వెండి ధర 2,41,460 రూపాయలు పలుకుతోంది. అయితే బంగారం ధరలను స్వల్పంగా పెరిగినట్లు మనము గమనించవచ్చు. పసిడి ధర పెరగడానికి ప్రధాన కారణం అమెరికా ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గడమే అని చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ తో శాంతి ఒప్పందం కుదుర్చుకున్న నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు తగ్గే ఛాన్స్ ఉందన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో అమెరికా డాలర్ బలహీన పడినట్లయితే బంగారం విలువ పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే గడిచిన వారం రోజులుగా గమనించినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గినట్లు మనం చూడవచ్చు. బంగారం ధర ఒక దశలో దాదాపు 15 వేల రూపాయల వరకు పడిపోతుందన్న వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం అమెరికా ఫెడరల్ వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు రైటర్ సంస్థ కూడా ఇటీవల ప్రచురించిన ఒక వార్త కథనంలో ఈ విషయాన్ని పేర్కొంది. నిజంగా వడ్డీ రేట్లు పెరిగినట్లయితే బంగారం ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంటుంది.
ఇదిలా ఉండగా మరోవైపు 2026 లో గోల్డ్ ఈటీఎఫ్ బాండ్లలో పెట్టుబడులు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. దాదాపు 13 నెలల తర్వాత ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో ఈటిఎఫ్ స్కీం ల నుంచి లాభాలను స్వీకరిస్తున్నారు. ఇది కూడా బంగారం ధర తగ్గడానికి ఒక కారణమయ్యే ఛాన్స్ ఉంది. సాధారణంగా ప్రపంచ దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగతున్న సమయంలో బంగారం ధరలో పెరుగుతాయి. కాని ప్రస్తుతం అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతున్న నేపథ్యంలో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని అంచనాలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా దేశంలో మరో నెలలో ఆషాడమాసం ప్రారంభమవుతుంది. ఆషాడంలో బంగారు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు చాలా మంది వివాది శుభకార్యాలు చేసేందుకు భారతీయులు ఎక్కువగా ఆసక్తి చూపించారు. ఎందుకంటే ఆషాడమాసంలో పెళ్లిళ్లు జరగవు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం బంగారం వెండి ధరలు కస్టమర్లు ఆకర్షించే అవకాశం ఉందని బంగారు యాజమాన్యాలు కూడా చెబుతున్నారు. డాలర్ బలపడడంతో పాటు ఇన్వెస్టర్ లాభాలు స్వీకరించడం ద్వారా కూడా బంగారం ధరలు తగ్గే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Disclaimer: ఈ కథనంలో పొందుపరిచిన సమాచారం కేవలం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టుబడి, ఆర్థిక, వ్యాపార లేదా న్యాయ సలహాగా పరిగణించరాదు. ఇందులోని వివరాలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా సేకరించబడ్డాయి. సమాచార ఖచ్చితత్వంపై జీ తెలుగు న్యూస్ ఎలాంటి హామీ ఇవ్వదు. ఈ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని తీసుకునే పెట్టుబడి లేదా ఇతర ఆర్థిక నిర్ణయాలకు సంబంధించి కలిగే లాభనష్టాలకు పూర్తిగా పాఠకులే బాధ్యులు. ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు అర్హత కలిగిన ఆర్థిక సలహాదారులను సంప్రదించడం మంచిది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.