
శాంతిభద్రతల దృష్ట్యా వైకాపా నాయకుడు పెద్దారెడ్డి అరెస్ట్ పోలీస్‌స్టేషన్ వద్ద మంచంపై పడుకుని నిరసన తెలుపుతున్న జేసీ ప్రభాకర్‌రెడ్డి తాడిపత్రి, అనంత నేరవార్తలు, న్యూస్‌టుడే: తెదేపా విజయోత్సవ ర్యాలీ
, ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ పేరుతో వైకాపా తలపెట్టిన నిరసన కార్యక్రమాలు శుక్రవారం అనంతపురం జిల్లా తాడిపత్రిలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రెండు పార్టీలూ ఒకేరోజు కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడంతో వైకాపా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు వారించినా పట్టించుకోకుండా వారిని తోసుకుంటూ పెద్దారెడ్డి, ఆయన అనుచరులు ర్యాలీ చేసేందుకు ముందుకెళ్లడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు పెద్దారెడ్డిని అదుపులోకి తీసుకుని అనంతపురం తరలించారు.
పెద్దారెడ్డిని అరెస్టు చేసి వాహనంలోకి ఎక్కిస్తున్న పోలీసులు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.