
ఈటీవీ భారత్: కట్టుడు పళ్లను వాడేవారు నిద్రించే వేళలో కొద్దిపాటి నిర్లక్ష్యం చేసినా.. అది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంటుంది. మధ్యప్రదేశ్‌లోని దమోహ్ జిల్లాకు చెందిన రామ్‌దాస్ (56) నిద్రకు ముందు
కట్టుడు పళ్లను తొలగించడం మరిచిపోయారు. అర్ధరాత్రి తర్వాత అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవడంతో కుటుంబసభ్యులు వెంటనే సాగర్‌లోని బుందేల్‌ఖండ్ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. కృత్రిమ దంతాల సెట్టు శ్వాస మార్గంలో ఇరుక్కుపోయి రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు వేగంగా పడిపోతున్నట్లు ఈఎన్టీ విభాగం వైద్యులు గుర్తించారు. అది ప్లాస్టిక్ పళ్ల సెట్టు కావడంతో ఎక్స్‌రే స్కానింగులో స్పష్టంగా కనిపించలేదు. దీంతో బాధితుడి ప్రాణాలను కాపాడటం వైద్యులకు సవాలుగా మారింది. మత్తు ఇచ్చి ఈసోఫేగోస్కోప్తో పళ్ల సెట్టును విజయవంతంగా బయటకు తీశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.