
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Highest Remuneration For Item Song: సినిమా ఇండస్ట్రీల్లో ఐటమ్ సాంగ్స్ కేవలం అభిమానులను అలరించడానికే కాదు.. కొన్నిసార్లు ఇవి సినిమా విజయానికి, మరోవైపు ప్రమోషన్లకు ప్రధాన బలంగా మారుతుంటాయి. మొన్నటి 'మున్నీ బద్నామ్ హుయీ' నుండి నిన్నటి 'ఆజ్ కీ రాత్' వరకు.. ఎన్నో పాటలు సినిమా కంటే పెద్ద హిట్‌గా నిలిచాయి. అందుకే స్టార్ హీరోయిన్లు కూడా ఈ ప్రత్యేక గీతాల్లో నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కేవలం మూడు, నాలుగు నిమిషాల పాట కోసం ఈ భామలు అందుకునే పారితోషికం కోట్లలో ఉంటుంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఐటమ్ సాంగ్స్ ద్వారా భారీగా క్రేజ్, రెమ్యునరేషన్ అందుకున్న టాప్ హీరోయిన్ల వివరాలను తెలుసుకుందాం.
1) సమంత రూత్ ప్రభు - రూ. 5 కోట్లు ఐటమ్ సాంగ్స్ చరిత్రలోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటిగా సమంత సరికొత్త రికార్డు సృష్టించింది. 'పుష్ప: ది రైజ్' సినిమాలోని 'ఊ అంటవా మావా ఊహూ అంటవా' పాట దేశవ్యాప్తంగా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. సమంత కెరీర్ లోనే ఇది మొదటి స్పెషల్ సాంగ్ కావడం విశేషం. కేవలం 3 నిమిషాల నిడివి గల ఈ పాట కోసం సమంతకు ఏకంగా రూ. 5 కోట్లు చెల్లించారట.
2) సన్నీ లియోన్ - రూ. 3 కోట్లు ఐటమ్ సాంగ్స్ అనగానే సన్నీ లియోన్ పేరు మొదటగా వినిపిస్తుంది. ఆమె కెరీర్‌ను మలుపు తిప్పిన 'బేబీ డాల్' పాట 2010వ దశకంలోనే అతిపెద్ద హిట్ డ్యాన్స్ ట్రాక్‌లలో ఒకటిగా నిలిచింది. ఆమె పాపులారిటీ పీక్స్‌లో ఉన్న సమయంలో ఒక్కో ఐటమ్ సాంగ్‌కు రూ.3 కోట్ల వరకు పారితోషికం వసూలు చేసేవారని టాక్.
3) మలైకా అరోరా - రూ. 2.5 కోట్లు బాలీవుడ్లో ఐటమ్ నంబర్ల ట్రెండ్‌ను పూర్తిగా మార్చేసి, దేశవ్యాప్తంగా ఊపు ఊపిన పాట 'మున్నీ బద్నామ్ హుయీ'. 2010లో వచ్చిన 'దబంగ్' సినిమాలోని ఈ పాటలో మలైకా అరోరా చేసిన మాస్ స్టెప్స్, హుక్ స్టెప్స్ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సమయంలోనే ఈ పాట కోసం మలైకాకు రూ.2.5 కోట్లు చెల్లించారు. అయితే ఈమె 'దబంగ్' రీమేక్ 'గబ్బర్ సింగ్' ఐటెంసాంగ్లోనూ నటించడం గమనార్హం.
4) కత్రినా కైఫ్ - రూ.2 కోట్లు 'అగ్నిపథ్' సినిమాలోని 'చిక్నీ చమేలీ' పాట బాలీవుడ్ క్లాసిక్ ఐటమ్ సాంగ్స్ లో ఒకటిగా నిలిచింది. కత్రినా కైఫ్ వేసిన అద్భుతమైన మాస్ స్టెప్స్ ఈ పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఈ సూపర్ హిట్ సాంగ్ కోసం కత్రినా రూ.2 కోట్లు అందుకుందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
5) నోరా ఫతేహి - రూ. 2 కోట్లు ప్రస్తుతం బాలీవుడ్లో మోస్ట్ పాపులర్ డ్యాన్స్ ఆర్టిస్టులలో నోరా ఫతేహి ఒకరు. ఆమె డాన్స్‌తో యూట్యూబ్‌లో రికార్డులు సృష్టించిన 'దిల్బర్ దిల్బర్' పాట ఇప్పటికీ అందరి నోళ్లలో మారుమోగుతూనే ఉంది. ఈ వైరల్ సాంగ్ కోసం నోరాకు రూ. 2 కోట్లు చెల్లించినట్లు సమాచారం.
6) తమన్నా భాటియా - రూ.1 కోటి ఇటీవల 2024లో సోషల్ మీడియాను షేక్ చేసిన పాటల్లో 'స్త్రీ 2' సినిమాలోని 'ఆజ్ కీ రాత్' ఒకటి. తమన్నా భాటియా తన గ్లామర్, ఉత్సాహభరితమైన నృత్యంతో ఈ పాటను సినిమా కంటే పెద్ద హిట్ చేసింది. ఈ క్రేజీ సాంగ్ కోసం తమన్నా సుమారు రూ. 1 కోటి పారితోషికం అందుకుందని తెలుస్తోంది.
వీరితో పాటు 'జలేబీ బాయి' పాటతో వెండితెరపై హాట్ డ్యాన్స్‌తో మెప్పించిన మల్లికా షెరావత్ కూడా ఈ ఐటమ్ సాంగ్స్ ద్వారా కోట్లాది రూపాయల పారితోషికాన్ని అందుకుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.