
JC Prabhakar Reddy Sensational Comments: తాడిపత్రి నియోజకవర్గంలో కొందరు స్వార్ధపూరిత అధికారుల వల్ల ప్రజాస్వామ్యం నిలువునా ఖూనీ అవుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఇక్కడి పోలీస్ యంత్రాంగం ఏ
విధంగా ఏకపక్షంగా అధికార పార్టీకి కొమ్ముకాసిందో.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొందరిలో అదే పాత ధోరణి కొనసాగుతోంది. దీనిపై వచ్చే సోమవారం నాడు జిల్లా ఎస్పీని స్వయంగా కలిసి.. నేను తాడిపత్రిలో ఉండాలా? లేక ఇక్కడి నుండి వెళ్ళిపోవాలా? అనే అంశాన్ని సూటిగా తేల్చుకుంటాను” అని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ శాసనసభ్యులు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
తాడిపత్రి టౌన్ పోలీస్ స్టేషన్ ముందు శుక్రవారం నిర్వహించిన 6 గంటల సుదీర్ఘ మంచం నిరసన అనంతరం.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఎఫ్ఐఆర్ కాపీని సాధించిన అనంతరం జేసీ ప్రభాకర్ రెడ్డి తన అనుచరులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంతపురం జిల్లా ఎస్పీ, తాడిపత్రి ఏఎస్పీ (ASP), స్థానిక సీఐలు మరియు ఎస్సైల పనితీరును లక్ష్యంగా చేసుకుని ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
Read Also: Tadipatri JC Prabhakar Reddy Protest:పోలీస్ స్టేషన్ ముందే జేసీ ప్రభాకర్ రెడ్డి మంచం నిరసన!
జేసీ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాడిపత్రి నియోజకవర్గంలో చట్టాన్ని సజావుగా అమలు చేయకుండా, శాంతిభద్రతల ముసుగులో విపక్ష నేతలకు కొమ్ముకాస్తున్న అధికారుల తీరును ఎండగట్టారు.
గత వైసీపి పాలనలో తనపై చిన్న చిన్న సాకులతో అక్రమ కేసులు పెట్టి, కక్షసాధింపు చర్యలతో జైలుకు పంపించిన విషయాన్ని జేసీ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను కడిగిన ముత్యంలా బయటకు వచ్చానని, జీవితంలో తానూ ఎవరికీ, ఏ శక్తులకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
“నా జీవితం మొత్తం తాడిపత్రి ప్రజలకే అంకితం. నేను జైలు గోడల మధ్య ఉన్న క్లిష్ట సమయంలో కూడా ఇక్కడి ప్రజలు నాపై నమ్మకంతో మున్సిపల్ ఎన్నికల్లో నన్ను, నా కౌన్సిలర్లను భారీ మెజారిటీతో గెలిపించారు. తాడిపత్రి ప్రజలు నాకు ఐదు సార్లు మున్సిపల్ చైర్మన్గా, ఒకసారి శాసనసభ్యుడిగా (MLA) సేవ చేసే అరుదైన అవకాశం ఇచ్చారు. వారి రుణం నేను ఈ జన్మలో తీర్చలేను” అని జేసీ ప్రభాకర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. ప్రస్తుతం జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసుల తీరుపై చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు అనంతపురం జిల్లా వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Tadipatri JC Prabhakar Reddy Protest:పోలీస్ స్టేషన్ ముందే జేసీ ప్రభాకర్ రెడ్డి మంచం నిరసన!
Tadipatri TDP YSRCP Rallies:రణరంగంగా మారిన తాడిపత్రి.. కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్!
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Kalyanadurgam Politics: కళ్యాణదుర్గంలో మద్యం రాజకీయాలు.. టిడిపి-వైసీపీ మధ్య పోరు!
Increase in Electricity charges : విద్యుత్ ఛార్జీల పెంపు పై మంత్రి గొట్టిపాటి క్లారిటీ
Jagan : టీడీపీకి రాజకీయ సమాధి కట్టేది జగనే – కొడాలి నాని
Kutami Government : ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయనిర్ణేతలు ప్రజలే – పవన్
Kutami Government : రెండేళ్లలో కూటమి సాధించిన ఘనతలు ఇవే – చంద్రబాబు