
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీకి చిత్రపటాన్ని అందిస్తున్న తితిదే ఈవో ఎం.రవిచంద్ర, తదితరులు.. చిత్రంలో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ తిరుమల, శ్రీకాళహస్తి, న్యూస్‌టుడే: రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత
ముఖేష్ అంబానీ, ఆయన కుమారుడు అనంత్ అంబానీ, కోడలు రాధికా మర్చంట్ శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున స్వామివారి అభిషేక సేవలో రిలయన్స్ అధినేత కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం వారికి రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, తితిదే ఈవో ఎం.రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్యచౌదరి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటం అందించారు. తితిదే సీవీఎస్వో మురళీకృష్ణ, ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పాల్గొన్నారు.
అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి ముకేష్ అంబానీ శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సందర్శించారు. రాహు, కేతు సర్పదోష నివారణ పూజలు చేయించారు. స్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయించారు. వారికి ఆలయం వద్ద స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి స్వాగతం పలికారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.