
వికసిత్ భారత్ నిర్మాణం అనే బృహత్ లక్ష్యంలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తుందని, నైపుణ్యం కలిగిన మానవ వనరులను సృష్టించడం ద్వారానే ఇది సాధ్యమవుతుందని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేశ్
స్పష్టం చేశారు. సుసంపన్న భవిష్యత్తు కోసం మానవ వనరులపై పెట్టుబడి పెట్టడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని ఆయన అన్నారు. విశాఖపట్నంలోని రాడిసన్ బ్లూ రిసార్ట్లో జరిగిన ‘డీజీ 100ఎక్స్ ఏపీ’ సదస్సు ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. విద్య, ఆవిష్కరణల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న మేధావుల మధ్య ఉండటం ఆనందంగా ఉందని, అందరి లక్ష్యం ఒక్కటేనని.. అదే బలమైన భారతదేశ నిర్మాణమని పేర్కొన్నారు.నైపుణ్యాభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యంప్రపంచం అత్యంత వేగంగా మారుతోందని, కృత్రిమ మేధ (ఏఐ) వంటి సాంకేతికతలు పరిశ్రమలను, ఉద్యోగాలను పునర్నిర్వచిస్తున్నాయని లోకేశ్ అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఏ దేశానికైనా, రాష్ట్రానికైనా అసలైన బలం భూమి, సహజ వనరులు కావని, ప్రతిభ కలిగిన మానవ వనరులేనని నొక్కిచెప్పారు. దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్ దేశానికి అత్యుత్తమ ప్రతిభను అందించిందని, చంద్రబాబు గత పదవీకాలాల్లో చేపట్టిన సంస్కరణల ఫలితంగానే నేడు సిలికాన్ వ్యాలీ నుంచి సింగపూర్ వరకు తెలుగువారు ఉన్నత స్థానాల్లో ఉన్నారని గుర్తుచేశారు. మన గొప్ప ఎగుమతి మన ప్రజలేనని, వారిపై పెట్టుబడి పెట్టడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు. విద్య అంటే కేవలం డిగ్రీ సర్టిఫికేట్ ఇవ్వడం కాదని, జీవితాంతం నేర్చుకునే ప్రక్రియలో ప్రభుత్వం భాగస్వామి కావాలని అన్నారు. అందుకోసం రెండు వారాల్లో "నైపుణ్యం పోర్టల్" ప్రారంభిస్తున్నట్లు