
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు
. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Police Complaint Review: తెలుగు వెండితెరపై హారర్ థ్రిల్లర్ అంశాలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చిన చిత్రమే ‘పోలీస్ కంప్లైంట్’. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుంది. ఎంఎస్కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి డైరెక్షన్లో రూపొందిన హారర్-యాక్షన్ థ్రిల్లర్ ‘పోలీస్ కంప్లైంట్’. ఈ రోజు థియేటర్స్‌లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.
కథ విషయానికొస్తే.. గర్భిణి మహిళ హత్యతో ఈ సినిమా కథ స్టార్ట్ ప్రారంభమవుతుంది. క్షుద్రపూజల పేరుతో జరిగినట్లు అనుమానిస్తున్న హత్య కేసు మూలన పడిపోతుంది. డాడీ కావాలంటూ చిన్నారి అద్వైత పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడంతోనే అసలు స్టోరీ స్టార్ట్ అవుతుంది. పాప తాను డాడీ అని పిలిచిన వాళ్ళందరూ ఒక్కొక్కరు చనిపోతుంటారు.ఈ క్రమంలో నిజాయితీ గల పోలీస్ అధికారి(వరలక్ష్మి శరత్‌కుమార్) ఈ కేసును రీ ఓపెన్ చేస్తోంది. ఈ క్రమంలో పోలీస్ అధికారికి కొన్ని విస్తుపోయే నిజాలు తెలుస్తాయి. అసలు ఈ హత్యలను ఎవరు చేయిస్తారు. దీని వెనక మోటివి్ ఏమిటి..? ఈ కమ్రంలో చివరకు ఏం జరిగిందనేదే ఈ సినిమా స్టోరీ.
కథనం, టెక్నికల్ విసయానికొస్తే.. క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఈ చిత్రాన్ని కర్మ సిద్ధాంతం ఆధారంగా తెరకెక్కించాడు. దానికి హారర్ థ్రిల్లర్ అంశాలను జోడించి ప్రేక్షకులను సీట్లో కూర్చోబెట్టారు.సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తం మిస్టరీ నేపథ్యంలో సాగిపోతుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ తర్వాత తర్వాత ఏం జరుగుతుందనే దానిపై ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేవాడు. సెకండాఫ్‌లో అసలు కథలోకి వచ్చిన తర్వాత కథనంలో వేగం పెరుగుతుంది. కేసు దర్యాప్తులో బయటపడే రహస్యాలు ప్రేక్షకులను చివరి వరకు కూర్చిలో కూర్చోబెట్టాల ఉన్నాయి. ముఖ్యంగా హారర్ సన్నివేశాలు, సస్పెన్స్ ఎలిమెంట్స్ కథకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి. సూపర స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతం అభిమానులకు మంచి ట్రీట్ అని చెప్పాలి. హారర్, యాక్షన్, థ్రిల్లర్ అంశాలను ఇష్టపడే ఆడియన్స్‌కు ‘పోలీస్ కంప్లైంట్’ మంచి థియేట్రికల్ అనుభూతిని అందిస్తుంది. మూఢనమ్మకాల నేపథ్యంలో కర్మ సిద్ధాంతాన్ని థ్రిల్లింగ్ కథతో చెప్పే ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించేలా ఉంది.
ఎస్.ఎన్. హరీష్ సొండెకొప్ప సినిమాటోగ్రఫీ.. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ఈయన చిత్రీకరించిన విధానం ఆకట్టుకుంటుంది. మెయిన్‌గా నైట్ సీన్స్‌లో పిక్చరైజేష్.. హారర్ ఎపిసోడ్స్‌ను విజువల్‌గా చక్కగా తన కెమెరాలో బంధించాడు. సంగీత దర్శకులు ఆరోహణ సుధీంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అనుగోజు రేణుకా బాబు ఎడిటింగ్ కథనాన్ని గ్రిప్పింగ్ గా సాగేలా దోహదపడింది. వీఎఫ్ఎక్స్, సౌండ్ డిజైన్ కూడా థ్రిల్లర్ కు గురి చేస్తాయి.
నటీనటుల విషయానికొస్తే.. వరలక్ష్మి శరత్‌కుమార్ మరోసారి తన అనుభవాన్ని రంగరించి మంచి నటనను ప్రదర్శించింది. భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె నటన బాగుంది. దర్యాప్తు అధికారిగా అతని స్క్రీన్ ప్రెజెన్స్ కథకు బలం చేకూర్చింది. నవీన్ చంద్ర తన పాత్రలో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. రాగిని ద్వివేది నటనతో పాటు గ్లామర్ రోల్లో అలరించింది. శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, జెమిని సురేశ్ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. కృష్ణసాయి తన పాత్రలో ఒదిగిపోయాడు. ముఖ్యంగా సూపర్‌స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన ప్రత్యేక గీతంలో ఆయన ప్రదర్శన ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్.
పంచ్ లైన్.. ఓ మోస్తరుగా మెప్పించే..పోలీస్ కంప్లైంట్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.