
Venky-ANil Ravipudi Movie : విక్టరీ వెంకటేష్, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో హ్యాట్రిక్ చిత్రంగా తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ (#VenkyAnil52) కు సంబంధించి ఒక అద్భుతమైన
అప్డేట్ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రానికి ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్, జాతీయ అవార్డు గ్రహీత జి.వి. ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీత దర్శకుడిగా ఎంపికయ్యారు. క్లాస్, మాస్, ఎమోషనల్, మెలోడీలతో పాటు అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) అందించడంలో జి.వి. ప్రకాష్‌కు ఉన్న ప్రత్యేక శైలిని దృష్టిలో పెట్టుకుని, ఈ చిత్రానికి చార్ట్‌బస్టర్ ఆల్బమ్‌ను రాబట్టేందుకు మేకర్స్ ఆయనను రంగంలోకి దించారు. వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్కు అనిల్ రావిపూడి మార్క్ కామెడీ తోడవుతున్న ఈ సినిమాలో జి.వి. ప్రకాష్ సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలవనుందని చిత్ర వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
Read Also : సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాతే పని మొదలవుతుంది.. నందినీ రెడ్డి
ఈ మ్యూజిక్ డైరెక్టర్ అనౌన్స్‌మెంట్‌ను మేకర్స్ అత్యంత వినూత్నంగా, నవ్వులు పూయించేలా డిజైన్ చేశారు. హాస్య బ్రహ్మ జంధ్యాల గారి క్లాసిక్ కామెడీ చిత్రాల్లోని సీన్లను గుర్తుకు తెచ్చేలా వైజాగ్ బీచ్ ఒడ్డున ఒక క్రేజీ స్పూఫ్ వీడియోను విడుదల చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జి.వి. ప్రకాష్‌ను వైజాగ్ బీచ్ ఇసుకలో సగానికి పైగా పాతిపెట్టి, దర్శకుడు అనిల్ రావిపూడి తనదైన శైలిలో చేసిన ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ వినూత్నమైన ప్రమోషన్ మరియు అనౌన్స్మెంట్ వీడియో సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసింది. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది.
Minister Ponguleti : కేంద్రంపై మంత్రి పొంగులేటి విమర్శలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Prabhas New Movie : బాహుబలితో ‘ధురంధర్’ డైరెక్టర్ సినిమా?
Bigg Boss 10 Agnipariksha Auditions: బిగ్ బాస్ సీజన్ 10 అగ్నిపరీక్ష ప్రారంభం.. ఆడిషన్స్ డేట్స్ ఇవే!
Director Nandini Reddy: సినిమా విడుదల తేదీ ఖరారైన తర్వాతే పని మొదలవుతుంది.. నందినీ రెడ్డి
Raghava Lawrence Political Entry: ప్రజలు ఓకే అంటేనే రాజకీయాల్లోకి వస్తా… లారెన్స్ కీలక వ్యాఖ్యలు
Nani : నిర్మాత గా మరో సినిమా చేయబోతున్న నాని !!
Kangana Ranaut : గుజరాతీ చీరకట్టులో వావ్ అనిపించిన కంగనా