
దేశంలో ఏ రోగానికి ఏ మందు కావాలో అది మన దగ్గర ఉందని.. అలాగే బ్రహ్మోస్ కూడా ఉన్నాయని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడారు. మన దగ్గర
వ్యాక్సిన్ ఉంది.. బ్రహ్మోస్ కూడా ఉందని పేర్కొన్నారు. భారత రాజకీయాల్లో మీ ఆశీస్సులు, మీ అభిమానం ఎవరికైనా లభించిందంటే అది భారతీయ జనతా పార్టీకే అన్నారు. మన ప్రధాని మోడీ అధికారం చేపట్టిన 12 ఏళ్లలో అంతర్జాతీయ సమాజంలో భారతదేశ ప్రతిష్ట పెరిగిందని పేర్కొన్నారు. భారతదేశం మాట ఎవరూ వినరు అనే స్థాయి నుంచి ఈనాడు అంతర్జాతీయ వేదికలపై భారతదేశం ఏది చెప్పినా.. యావత్ ప్రపంచం శ్రద్ధగా వింటోందని తెలిపారు.
ఇక తెలంగాణలో జాతీయ రహదారులు డబుల్ అయ్యాయన్నారు. 5 వేల 500 కోట్లు రైల్వే బడ్జెట్ మంజూరు అయిందన్నారు. పీఎం మిత్రా పార్క్‌ను గత నెలలో మోడీ ప్రారంభించారని తెలిపారు. ఇక దేశంలో మోడీ నేతృత్వంలో నక్సలిజం లేకుండా చేశామని పేర్కొన్నారు. అలాగే ఆర్టికల్ 370ను రద్దు చేసినట్లు చెప్పారు. కాశ్మీర్ లాల్‌చౌక్‌లో తిరంగా ఎగరుతుందని... ఇండస్ట్రీలు వస్తున్నాయని తెలిపారు. అలాగే కృష్ణాష్టమి వేడుకలు కూడా జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు.
ఒకప్పుడు మన దేశంలో పెట్టుబడులు పెట్టాలంటే విదేశాలు భయపడేవని.. ఇప్పుడు ఎన్నో దేశాలు మన దేశంతో ట్రేడ్ ఒప్పందాలు చేసుకుంటున్నాయని రాజ్‌నాథ్‌సింగ్ చెప్పుకొచ్చారు.