
బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తన జీవితంలోని వివాదాస్పద ఘటన ఆధారంగా తెరకెక్కుతున్న 'కాలా హిరన్: ది బాటిల్ ఫర్ లెగసీ' చిత్రంపై న్యాయపోరాటానికి దిగారు. ఈ సినిమా నిర్మాణం, ప్రచారం, విడుదలను తక్షణమే
నిలిపివేయాలని కోరుతూ ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ చిత్రం తన వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించడమే కాకుండా, తన పరువు ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా ఉందని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు.సివిల్ ప్రొసీజర్ కోడ్ కింద నిర్మాత అమిత్ జానీ, జానీ ఫైర్ఫాక్స్ ఫిల్మ్స్, దర్శకుడు భరత్ శ్రీనాతే, కాస్టింగ్ డైరెక్టర్ అక్షయ్ పాండే తదితరులపై శాశ్వత, తాత్కాలిక ఇంజక్షన్ ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన కోరారు. ఈ కేసు పరిష్కారమయ్యే వరకు సినిమాకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలు, పంపిణీ, ప్రదర్శన వంటి ఎలాంటి కార్యక్రమాలను చేపట్టకుండా నిరోధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.1998 నాటి కృష్ణ జింకల వేట కేసు ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారని, సినిమా పోస్టర్లు, ప్రచార సామగ్రిలో తన పేరును, ఫొటోను అనుమతి లేకుండా వాడుకుంటున్నారని సల్మాన్ ఆరోపించారు. కృష్ణ జింకల వేట కేసు ప్రస్తుతం రాజస్థాన్ హైకోర్టులో విచారణ దశలో ఉన్నందున, సినిమా విడుదల న్యాయపరమైన ప్రక్రియపై ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.ఈ అంశంపై సల్మాన్ ఖాన్ బృందం ఏప్రిల్ 24నే చిత్ర యూనిట్‌కు లీగల్ నోటీసులు పంపింది. అయితే, వారి నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు, ఈ సినిమా ఏ వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని