
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Indian Players In FIFA World Cup 2026: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా సంబరం 'ఫీఫా ప్రపంచ కప్ 2026' అట్టహాసంగా ప్రారంభమైంది. జూన్ 12 అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం) మొదలైన ఈ సుదీర్ఘ టోర్నమెంట్లో మొత్తం 48 జట్లు తలపడుతున్నాయి. జూలై 20 వరకు జరిగే ఈ మహా సంగ్రామంలో లీగ్ దశ ముగిసేసరికి 32 జట్లు నాకౌట్‌కు, ఆ తర్వాత 16 జట్లు తదుపరి రౌండ్‌కు అర్హత సాధిస్తాయి.
లియోనెల్ మెస్సీ, క్రిస్టియానో రొనాల్డో, కైలియన్ ఎంబాపే, నెయ్మార్, లామిన్ యమాల్ వంటి దిగ్గజాలను ఒకే వేదికపై చూడటానికి అభిమానులు ఎంతో ఆతృతగా ఉన్నారు. అయితే, ఈ మెగా టోర్నీలో మన భారత ఫుట్‌బాల్ జట్టు ఆడనప్పటికీ.. దేశంలోని ఫుట్‌బాల్ అభిమానులకు గర్వకారణంగా నిలుస్తూ నలుగురు భారత సంతతి ఆటగాళ్లు వేర్వేరు దేశాల తరఫున బరిలోకి దిగుతున్నారు. అందులోనూ ఇద్దరు దక్షిణాది మూలాలు ఉన్నవారు కావడం విశేషం.
1) నిషాన్ వేలుపిళ్ళై (ఆస్ట్రేలియా) - తొలి తమిళ ప్లేయర్ ఆస్ట్రేలియా (మెల్బోర్న్)లో పుట్టి పెరిగిన నిషాన్ తండ్రి శశినాథ్ వేలుపిళ్ళై శ్రీలంక తమిళ సంతతికి చెందినవారు. అతని వయసు 25 ఏళ్లు. తల్లి గిలియన్ ఆంగ్లో-ఇండియన్. అక్టోబర్ 2024లో చైనాతో జరిగిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరఫున అరంగేట్రం చేసిన నిషాన్, 83వ నిమిషంలో అద్భుతమైన గోల్ కొట్టి తన జట్టును ప్రపంచ కప్‌నకు అర్హత సాధించేలా చేశాడు. ఫీఫా ప్రపంచ కప్‌లో ఆడుతున్న తొలి తమిళ మూలాల ఆటగాడు ఇతనే. ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్‌ను జూన్ 14న టర్కీతో ఆడనుంది.
2) శామ్యూల్ ముత్తుసామి (డీఆర్ కాంగో) - రొనాల్డోతో ఫైట్! శామ్యూల్ తండ్రి ముత్తుసామి (29 ఏళ్లు) తమిళ మూలానికి చెందిన ఇండో-గ్వాడెలోపే సంతతికి (19వ శతాబ్దంలో కరేబియన్ దీవులకు వలస వెళ్లిన దక్షిణ భారత కార్మికులు) చెందినవారు. తల్లి కాంగో దేశస్థురాలు. శామ్యూల్ ప్రస్తుతం ఫ్రెంచ్ పౌరసత్వం కలిగి ఉండి, యూరోపియన్ లీగ్స్‌లో ఆడుతున్న ముత్తుసామి ఇప్పటివరకు 57 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. జూన్ 17న జరిగే మ్యాచ్‌లో ముత్తుసామి ప్రాతినిధ్యం వహిస్తున్న డీఆర్ కాంగో జట్టు.. క్రిస్టియానో రొనాల్డో నేతృత్వంలోని పోర్చుగల్‌తో తలపడనుంది.
3) దాసిన్ ముహమ్మద్ జంషెడ్ (ఖతార్) - కేరళ ముద్దుబిడ్డ ఖతార్ రాజధాని దోహాలో జన్మించిన దాసిన్ (19 ఏళ్లు) తల్లిదండ్రులు కేరళకు చెందినవారు. తండ్రి జంషీద్ (తలస్సేరి), తల్లి షైమా (కన్నూర్). ఫీఫా ప్రపంచ కప్ ఆడబోతున్న కేరళకు చెందిన మొట్టమొదటి ఆటగాడు దాసిన్ కావడం గమనార్హం. ఖతార్ అండర్-17, అండర్-19 జట్లలో ఆడి సీనియర్ జట్టుకు ఎంపికయ్యాడు.
4) సర్ ప్రీత్ సింగ్ (న్యూజిలాండ్) - పంజాబీ పవర్ న్యూజిలాండ్ (ఆక్లాండ్)లో స్థిరపడిన పంజాబ్‌లోని జలంధర్‌కు చెందిన భారతీయ దంపతులకు సర్ప్రీత్ సింగ్ (27 ఏళ్లు) జన్మించాడు. ప్రపంచ కప్‌లో ఆడుతున్న అత్యంత ప్రజాదరణ పొందిన భారత సంతతి ఆటగాళ్లలో సర్ ప్రీత్ సింగ్ ఒకడు. న్యూజిలాండ్ తరఫున 24 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవం ఇతనికి ఉంది. జూన్ 16న ఇరాన్‌తో జరిగే మ్యాచ్‌తో న్యూజిలాండ్ తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నాడు.
భారత్‌లో లైవ్ ఎక్కడ చూడాలి? భారతదేశంలోని ఫుట్‌బాల్ ప్రేమికుల కోసం జీ ఎంటర్టైన్మెంట్ (ZEE) ప్రత్యక్ష ప్రసార ఏర్పాట్లు చేసింది. యునైట్8 స్పోర్ట్స్ 1 & 1 HD (Unite8 Sports), యునైట్8 స్పోర్ట్స్ 2 & 2 HD టీవీ ఛానళ్లలో ఫుట్ బాల్ ప్రపంచకప్‌ను ప్రత్యక్ష ప్రసారంగా చూడొచ్చు. అలాగే ఓటీటీ యాప్ జీ5 (ZEE5)లోనూ లైవ్ టెలికాస్ట్ అవుతుంది.
అయితే ఈ ప్రపంచకప్ చూడాలనుకున్న ప్రేక్షకులకు అతి తక్కువ ధరలకే జీ5 సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అందుబాటులో ఉంచింది. రూ.799 సబ్స్క్రిప్షన్ ప్లాన్‌తో 3 నెలలకు గానూ గరిష్టంగా 3 డివైజ్‌ల్లో మ్యాచ్ చూసేందుకు అనుమతి ఉంది. అలాగే ఏడాది సబ్స్క్రిప్షన్ కోసం రూ.1,699 చెల్లిస్తే 4 డివైజ్‌ల్లో ఈ మ్యాచ్‌లను చూసి ఎంజాయ్ చేయోచ్చు.
మన దేశ జట్టు ఆడకపోయినా, మన రక్తం పంచుకున్న నలుగురు ఆటగాళ్లు ప్రపంచ అత్యున్నత వేదికపై మెరవనుండటం భారతీయులందరికీ గర్వకారణం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.