
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Mlc Jeevan Reddy Latest News: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో ఘోరంగా విఫలమైందని సీనియర్ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. జమ్మికుంట పట్టణంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ జెండాను ఆవిష్కరించి.. పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నప్పటికీ.. మహిళలకు ఇచ్చిన కీలకమైన హామీలను అటకెక్కించారని మండిపడ్డారు..
మేనిఫెస్టోలో నేను ఉన్నా.. అమలులో ఎందుకు లేదు? ఈ కార్యక్రమంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలను సిద్ధం చేసినప్పుడు.. ఆ మేనిఫెస్టో రూపకల్పన కమిటీలో తాను కూడా ఒక కీలక భాగస్వామిని ఆయన గుర్తు చేశారు. ప్రజలు మేలు చేయాలని ఉద్దేశంతోనే ఆనాడు అనేక హామీలను పొందుపరిచామని.. అయితే నేడు అధికారంలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలను నీరు కారుస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్న నిబంధనలతో పాటు హామీలు క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
కోటీశ్వరులు వద్దు.. రూ.2,500 ఇస్తే చాలు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి వేదికపై మహిళలను కోటీశ్వరులు చేస్తామంటూ గొప్పలు చెబుతున్నారని.. కానీ ఆ మాటల్లో అంత బోగస్ తప్ప నిజం లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ ఆడబిడ్డలను కోటీశ్వరులు చేయడం కంటే.. కనీసం లక్షల అధికారులను చేసిన చాలని ఆయన ఎద్దేవ చేశారు.. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు ప్రతి నెల రూ.2,500 అందిస్తామని నమ్మ బలికిందని.. ప్రభుత్వం ఏర్పడి ఇంతకాలం అవుతున్న ఆ ఉసే ఎత్తడం లేదని.. పెద్దపెద్ద మాటలు చెప్పడం ఆపి.. ముందుగా మహిళలకు ఇస్తామన్న ఆర్థిక సహాయాన్ని తక్షణమే విడుదల చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కార్యకర్తలకు పిలుపు.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తెలంగాణలోని అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయని.. నేడు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ప్రజలు మోసపోయామని గ్రహించారని ఆయన అన్నారు.. రాబోయే రోజుల్లో ప్రజాపక్షాన పోరాటాలు చేయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని.. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ముఖ్య నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు, మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.