
దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో నాలుగు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్
, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
CBI Probe Singareni: సింగరేణి కాలరీస్ సంస్థ పరిధిలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులలో జరుగుతున్న బొగ్గు నిల్వలా మాయాజాలంతో పాటు ఇతర అక్రమాలపై తక్షణమే కేంద్ర దర్యాప్తు సంస్థ సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం రామగుండం లోని సింగరేణి సంస్థ OCP-5 ప్రాజెక్టును ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి.. అక్కడ ఉన్న బొగ్గు నిల్వలను నిషితంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రికార్డులకు, వాస్తవాలకు పొంతన లేకపోవడాన్ని చూసిన ఆయన ఆశ్చర్యానికి గురైనట్లు తెలుస్తోంది.
కాగితాల్లో కొండంత.. క్షేత్రస్థాయిలో గోరంత.. అనంతరం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. సింగరేణి యాజమాన్యం తీరుపై విమర్శల వర్షం కురిపించారు. అధికారిక రికార్డుల ప్రకారం.. సదరు ప్రాజెక్టులలో ఏకంగా 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు చూపించారని.. కానీ వాస్తవానికి అక్కడ కనీసం 50 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు కూడా అందుబాటులో లేదని ఆయన బట్టబయలు చేశారు.. లక్షలాది టన్నుల బొగ్గు ఎటు పోయిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాగితాలలో ఒక లెక్కలు.. క్షేత్రస్థాయిలో మరోలా ఉండడం అసలు ఏంటని ప్రశ్నించారు.. రికార్డుల్లో కొండంత బొగ్గు నిల్వలు చూపిస్తూ.. క్షేత్రస్థాయిలో మాత్రం పైసా నమ్మకం లేని రీతిలో వ్యవహరిస్తున్నారని.. ఇంతటి భారీ కుంభకోణం వెనక ఎవరి హస్తము ఉందో తేలాలి అని.. కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.. నష్టాల ఊబిలోకి నెట్టేసేందుకు.. సింగరేణి సంస్థను లాభాల బాట నుంచి నష్టాల ఊబిలోకి నెట్టేసేందుకు కొందరు అధికారులతో పాటు దళారులు కుమ్మక్కయ్యారని.. ఆయన మీడియా ముఖంగా ఆరోపించారు. రికార్డులను తారుమారు చేస్తూ.. నిల్వలను తక్కువ చేసి చూపిస్తూ కోట్ల రూపాయల అవినీతికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.. ఈ అక్రమాలకు బాధ్యులైన వారందరినీ చట్టం ముందు నిలబెట్టాలని.. ఎందుకు సిబిఐ దర్యాప్తు ఒకటే సరైన మార్గమని ఆయన స్పష్టం చేశారు..
తెలంగాణ గుండెకాయ లాంటి సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటూ.. సంస్థ ఆస్తులను కొల్లగొడుతున్న వారిపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని.. తక్షణమే ఈ నిల్వల మాయంపై ఉన్నత స్థాయి విచారణకు ఆదేశాలు ఇవ్వాలని కొప్పుల ఈశ్వర్ గట్టిగా డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్రమే దగ్గరుండి ప్రత్యేకమైన దర్యాప్తును జరిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికంగా ఉన్న నాయకులతో పాటు కార్మికుల సంఘాల ప్రతినిధులు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.