
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
FIFA World Cup Lady Fan Viral Video: ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫుట్‌బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'ఫిఫా ప్రపంచకప్ 2026' టోర్నమెంట్ అత్యంత ఉత్కంఠభరితంగా ప్రారంభమైంది. గ్రూప్-ఏ లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్‌లోనే ఆతిథ్య మెక్సికో జట్టు 2-0 గోల్స్ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసి ఘనవిజయాన్ని అందుకుంది. అయితే, ఈ మ్యాచ్ ఆట పరంగానే కాకుండా.. రిఫరీ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు, గ్యాలరీలో ఒక మహిళా అభిమాని చేసిన హంగామాతో నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
గ్యాలరీలో హద్దులు దాటిన లేడీ ఫ్యాన్! మ్యాచ్ ప్రారంభమైన 9వ నిమిషంలోనే మెక్సికో మిడ్‌ఫీల్డర్ ఎరిక్ లిరా అందించిన పాస్‌తో జూలియన్ క్వినోనెస్ అద్భుతమైన తొలి గోల్ సాధించాడు. ఆ సమయంలో గ్యాలరీలోని మెక్సికన్ మహిళా అభిమాని ఒకరు ఆనందంతో హద్దులు దాటి ప్రవర్తించింది. గోల్ పడిన సంతోషంలో ఒళ్లు మరిచి, తన ప్రైవేట్ భాగాలను (ఛాతిభాగం) బహిర్గతం చేస్తూ చిందులు వేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారి సెగలు పుట్టిస్తోంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆమె కావాలనే అలా చేసిందని కొందరు విమర్శిస్తుండగా, మెక్సికన్ సంస్కృతిలో ఇది సాధారణమే అని మరికొందరు సమర్థిస్తున్నారు.
ఒకే మ్యాచ్‌లో 3 రెడ్ కార్డ్‌లు.. ఈ మ్యాచ్‌లో మెక్సికో విజయం కంటే రిఫరీ నిర్ణయాలే ఎక్కువగా హాట్ టాపిక్‌గా మారాయి. ఫుట్‌బాల్ చరిత్రలోనే అత్యంత అరుదుగా.. ఈ మ్యాచ్‌లో రిఫరీ ఏకంగా ముగ్గురు ఆటగాళ్లకు నేరుగా 'రెడ్ కార్డ్' చూపించి మైదానం వెలుపలికి పంపారు. కనీసం 'ఎల్లో కార్డ్' హెచ్చరికలు కూడా ఇవ్వకుండా రిఫరీ తీసుకున్న ఈ నిర్ణయంపై క్రీడా విశ్లేషకులు, ప్రేక్షకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఓడిపోయిన దక్షిణాఫ్రికా ఫ్యాన్స్.. "ఈ మ్యాచ్‌లో రిఫరీకే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు ఇవ్వాలి" అంటూ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ట్రోల్స్ చేస్తున్నారు.
వివాదాలు పక్కన పెడితే, ఆతిథ్య మెక్సికో జట్టు ఈ మ్యాచ్‌లో కొన్ని అద్భుతమైన మైలురాళ్లను అందుకుంది. మ్యాచ్ 67వ నిమిషంలో రాబర్టో అల్వరాడో ఇచ్చిన క్రాస్‌ను 35 ఏళ్ల సీనియర్ ప్లేయర్ హిమెనెజ్ నమ్మశక్యం కాని రీతిలో హెడర్ ద్వారా గోల్‌గా మలిచాడు. దీంతో ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వయసులో గోల్ కొట్టిన కొద్దిమంది ఆటగాళ్ల సరసన ఆయన నిలిచాడు.
మెక్సికోకు చెందిన కేవలం 17 ఏళ్ల గిల్బెర్టో మోరా ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగాడు. దీని ద్వారా ఫిఫా ప్రపంచకప్ చరిత్రలో ఆతిథ్య దేశం తరఫున ఆడిన అత్యంత పిన్న వయస్కుడిగా మోరా సరికొత్త రికార్డు సృష్టించాడు.
సౌతాఫ్రికా కొంపముంచిన తప్పులు దక్షిణాఫ్రికా జట్టు మొదట్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. వారి గోల్‌కీపర్ రోన్వెన్ విలియమ్స్ చేసిన చిన్న పొరపాట్లు, డిఫెండర్ల మధ్య సమన్వయ లోపం ఆ జట్టును దెబ్బతీశాయి. లభించిన పరిమిత అవకాశాలను గోల్స్‌గా మలచడంలో సౌతాఫ్రికా స్ట్రైకర్లు విఫలమయ్యారు. తొలి మ్యాచ్‌లోనే 2-0తో ఘన విజయం సాధించడంతో మెక్సికో జట్టు, వారి అభిమానులు ఈసారి కప్పు తమదేనన్న ధీమాతో సంబరాలు చేసుకుంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.