
Charu Pandey: దృఢ సంకల్పం, పక్కా ప్రణాళిక, నిరంతర శ్రమ ఉంటే ఎంతటి కష్టమైన లక్ష్యాన్నయినా సాధించవచ్చని నిరూపించింది ఓ సాధారణ గ్రామీణ యువతి. నేటి రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే గగనమైపోతున్న
తరుణంలో, నిండా పాతికేళ్లు కూడా లేని ఆ యువతి ఏకంగా 19 ప్రభుత్వ కొలువులు సాధించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 23 ఏళ్ల చారు పాండే సాధించిన ఈ అసాధారణ విజయం ప్రస్తుతం దేశంలోని లక్షలాది మంది ఉద్యోగార్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌పూర్ జిల్లాలోని ‘టిల్డా-నెవోరా’ అనే చిన్న గ్రామానికి చెందిన చారు పాండే.. తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని సొంత ఊరిలోనే పూర్తి చేసింది. ఆ తర్వాత హేమ్‌చంద్ యాదవ్ విశ్వవిద్యాలయం నుండి మేథ్స్ (గణిత శాస్త్రం) లో బీఎస్సీ డిగ్రీ పట్టా పుచ్చుకుంది. కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలకు సిద్ధమవ్వడం ప్రారంభించింది.
read also: El Nino: ఎల్‌నినో ఎంట్రీ రానున్న రోజుల్లో రికార్డు స్థాయికి చేరనున్న ఉష్ణోగ్రతలు
క్రమశిక్షణతో కూడిన చదువు, వినూత్న వ్యూహాలతో చారు పాండే దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నియామక పరీక్షలన్నింటినీ లైన్ గా క్లియర్ చేసుకుంటూ వెళ్ళింది. ఆమె సాధించిన విజయాల జాబితా ఇదిగో:
కేవలం 23 ఏళ్ల ప్రాయంలోనే 19 ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికై రికార్డు సృష్టించిన చారు పాండే ప్రతిభను కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. రాబోయే ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో ఆమెను ప్రత్యేకంగా సత్కరించనుంది. ఈ మెగా ఈవెంట్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చారు పాండే ప్రతిష్టాత్మక ‘గోల్డ్ మెడల్’ అందుకోనుంది.
ఇన్ని ఉద్యోగాలు సాధించిన చారు పాండే.. ప్రస్తుతం చెన్నైలోని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (CAG) కార్యాలయంలో ‘అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ (AAO)’ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఆమె తన సక్సెస్ సీక్రెట్ గురించి మాట్లాడుతూ.. “నా ప్రయాణం నేరుగా విజయంతో ప్రారంభం కాలేదు. తొలినాళ్లలో నేను కూడా కొన్ని పరీక్షల్లో ఫెయిల్ అయ్యాను. కానీ ఆ ఓటములను చూసి నేను నిరాశపడలేదు. నేను ఎక్కడ తప్పు చేస్తున్నానో విశ్లేషించుకుని, వాటిని సరిదిద్దుకున్నాను. ప్రతిరోజూ సబ్జెక్టుల వారీగా నోట్స్ రాసుకోవడం, క్రమం తప్పకుండా మాక్
YCP : మంత్రి సవితపై YCP నేత ఉషశ్రీ చరణ్ తీవ్ర విమర్శలు
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.
Iran Supreme Leader: అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు మళ్ళీ వాయిదా
Hyderabad new flyover: అసెంబ్లీ వద్ద భారీ ఫ్లైఓవర్ నిర్మాణానికి హెచ్ఎండీఏ గ్రీన్ సిగ్నల్
Govt Petrol Diesel Purchase : పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం
Apple iphone 17 pro max discount: భారీగా తగ్గిన ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మాక్స్ ధర
AP medical recruitment: ఏపీలో 419 స్టాఫ్ నర్సు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Meenakshi Natarajan’s Rajya Sabha nomination : రాజ్యసభ నామినేషన్ కేసు.. రేపటికి వాయిదా