
కాంగ్రెస్ లో సంచలనంగా మారిన మీనాక్షి నటరాజన్ వ్యవహారం పై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిదానికి సిట్ వేస్తుంది కదా.. ఆ పార్టీ నాయకురాలు మీనాక్షి నటరాజన్ అంశంపైన కూడా సిట్
వేయాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. బీజేపీలో ఎవరికి ఫ్రెండ్స్ ఉన్నారో మీనాక్షి నటరాజన్ అంటే ఎవరికి కోపం ఉందో వాళ్లే కేసు గురించి ఎన్నికల కమిషన్‌కు చెప్పి ఉంటారని వ్యాఖ్యానించారు.తాజాగా చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల పై కేటీఆర్ స్పందించారు. మీడియాతో చిట్ ఛాట్ లో ఈ వ్యాఖ్యలు చేసారు. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న బ్లాక్ షీప్ (పార్టీ ద్రోహులు) ఎవరో కనుక్కోవాలి. కాంగ్రెస్ పార్టీ అంటేనే కంపు. అలాంటి కాంగ్రెస్ కంపులో ద్రోహాల పార్టీ అంశంలో మమ్మల్ని ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ అంటే పడని వారే ఈ పని చేశారు. మీనాక్షి నటరాజన్‌కి తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవరు వ్యతిరేకులో ప్రజలందరికీ తెలుసన్నారు. కాంగ్రెస్ పార్టీలో పదవులు, డబ్బులకే వస్తున్నాయని షబ్బీర్ అలీ చెప్పినం దుకు అభినందనలని పేర్కొన్నారు షబ్బీర్ అలీ ఇప్పటికైనా ఉన్న వాస్తవాన్ని ప్రజల ముందు గట్టిగా చెప్పారని వ్యాఖ్యానించారు. అసలు గతంలో పీసీసీ పదవిని పైసలకు అమ్ముకున్నది కాంగ్రెస్ పార్టీనేనని.. ఆ తర్వాత ముఖ్యమంత్రి పదవిని కూడా డబ్బులకే అమ్ముకున్నదని ఆరోపించారు.కేసీఆర్ ఊహించని నిర్ణయం, కీలక మలుపు..!!ఫ్యూచర్ సిటీ పై కీలక వ్యాఖ్యలురేవంత్ రెడ్డి పేమెంట్ కోటా సీటు అన్న విషయం అందరికీ తెలుసని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రతి నెలా డబ్బుల మూట పంపితేనే ఆయన పదవి ఉంటుందని ఎద్దేవా చేసారు. రేవంత్ రెడ్డి రెగ్యులర్ సీఎం కాదు, రెన్యూవల్ సీఎం అని అందరికీ తెలుసన్నారు. ఎయిర్ పోర్టు మెట్రో పూర్తయితే ఇంత ట్రాఫిక్ ఉండదు, కానీ ఆ ప్రాజెక్టు రేవంత్ రెడ్డి ఆపేశాడని ఆరోపించారు. ఉన్న నగరాన్ని గాలికి వదిలేసి ఫ్యూచర్ సిటీ అనడం ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ఫ్యూచర్ సిటీ అని ఊహల్లో బతుకుతున్నాడని ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌ను మరింతగా అభివృద్ధి చేస్తే సరిపోతుందన్నారు. రేవంత్‌ రెడ్డికే ప్యూచర్‌ లేదు ఇంకా ప్యూచర్‌ సిటీ ఎంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అసమర్ద పాలనతో రాష్ట్రం 40 ఏండ్లు వెనక్కి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొన్నటి ఒక్క వర్షానికే నగరం చెరువులను తలపించిందని విమర్శించారు.