
ఇంటర్నెట్‌డెస్క్: ప్రస్తుత తెలుగు దర్శకుల్లో అనిల్ రావిపూడి (Anil Ravipudi) మేకింగ్, టేకింగ్ డిఫరెంట్. సినిమా మొదలైన దగ్గరి నుంచి విడుదలయ్యే వరకూ ఆయన ప్రమోషన్ వర్క్ కూడా ప్రత్యేకంగానే
ఉంటుంది. వెంకటేశ్, కల్యాణ్‌రామ్ కీలక పాత్రల్లో అనిల్ దర్శకత్వంలో ఓ కొత్త మూవీ పట్టాలెక్కనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తయింది. త్వరలోనే దీనిని సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్‌కుమార్ సంగీతం అందిస్తున్నారు.
సాధారణంగా ఎవరైనా మూవీ మొదలయ్యాక ప్రమోషన్స్ మొదలు పెడతారు. కానీ, ఇంకా సినిమా మొదలు పెట్టకుండానే అనిల్ వైవిధ్యంగా ప్రేక్షకుల్లోకి ఈ మూవీని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్‌కుమార్‌తో కలిసి ఆయన చేసిన వీడియో నవ్వులు పంచుతోంది. ‘వివాహ భోజనంబు’లో సుత్తి వీరభద్రరావు, బ్రహ్మానందం మధ్య బీచ్‌లో జరిగే ఓ సన్నివేశాన్ని రీక్రియేట్ చేశారు. ఈ సందర్భంగా సుత్తి వీరభద్రరావు పలికే సంభాషణలు, అందుకు బ్రహ్మానందం హావభావాలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇప్పుడు అచ్చం అలాగే జీవీ ప్రకాశ్‌ను పీకల్లోతు ఇసుకలో పాతిపెట్టి అనిల్ రావిపూడి తన మూవీకి కావాల్సిన పాటల వివరాలు జీవీకి చెబుతూ నవ్వులు పంచారు. ‘కనీసం చేతులైన బయటకు తీయండి మహాప్రభో’ అంటూ జీవీ చెప్పడం, లిరిక్ రైటర్ గురించి అడిగితే ‘రెండు రోజుల ముందే అతడిని పాతిపెట్టా’ అంటూ అనంత్ శ్రీరామ్‌ను చూపించడం కితకితలు పెడుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.