
పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి
Jun 12 2026 4:31 PM | Updated on Jun 12 2026 4:36 PM
పేరుకే అందాల సుందరి. చేసేది మాత్రం గలీజ దందా. 28 ఏళ్ల మోడల్, 'మిసెస్ కేరళ' 2025 పోటీదారు హర్ష సన్నీ దాదాపు 12 కోట్ల రూపాయల విలువైన గంజాయిని అక్రమంగా తరలిస్తూ అడ్డంగా బుక్కైంది. బ్యాంకాక్ నుండి విమానంలో ముంబైకి వస్తూ పోలీసులకు చిక్కింది.
కస్టమ్స్ అధికారుల ప్రకారం, హర్ష సన్నీ జూన్ 10-11 తేదీల రాత్రి ఎయిర్ ఇండియా విమానం TG-351లో బ్యాంకాక్ నుండి ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. బ్యాంకాక్‌నుంచి 11 కిలోలకు పైగా హై క్వాలిటీ 'హైడ్రోపోనిక్ గంజాయి'ని గుట్టుచప్పుడు కాకుండా బాగానే తీసుకొచ్చింది. కానీ ఆమె ప్రవర్తనను గమనించిన ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU), కస్టమ్స్ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించగా అసలు గట్టు రట్టైంది.
ఇదీ చదవండి: ఒకే ఒక్కడు మృత్యుంజయుడు.. ఇపుడెలా ఉన్నాడు?
ఆమె ట్రాలీ బాగ్‌లో 12 వాక్యూమ్-సీల్డ్ ప్లాస్టిక్ ప్యాకెట్లు లభించాయి. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (NDPS) కిట్‌ను ఉపయోగించి అక్కడికక్కడే జరిపిన రసాయన పరీక్షలో, ఆ పదార్థం'హైడ్రోపోనిక్ గంజాయి' అని నిర్ధారణ అయింది. విలువ రూ. 11.82 కోట్లు ఉంటుందని అంచనా. దీంతో ఆమెను ఎన్డిపిఎస్ చట్టం కింద అరెస్టు చేశారు. అనంతరం కోర్టు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఈ సరుకును ముంబైలో లేదా దేశంలోని ఇతర ప్రాంతాలలో ఎక్కడకు చేరవేయాలనుకున్నారనే విషయాన్ని నిర్ధారించడానికి దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదీ చదవండి: కన్నతండ్రినీ, అక్కను ఎప్పటికీ చూడలేని చిన్నారి కన్నీటి కథ!
శారీలో హీరోయిన్ ప్రీతి ముకుందన్ అందాలు.. ఫోటోలు
చంద్రబాబు వెన్నుపోటుకి రెండేళ్లు.. వైఎస్సార్సీపీ సమర శంఖం (ఫొటోలు)
కొత్త మలుపు మూవీతో టాలీవుడ్ కి పరిచయం అవుతున్న భైరవి (ఫొటోలు)
‘వెల్కమ్ టు ది జంగిల్’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
అసమర్థ, చేతకాని హోం మంత్రి... లెఫ్ట్ అండ్ రైట్ వాయించిన పుష్ప శ్రీవాణి
ఏ క్షణమైనా అరెస్ట్ పరారీలో నందుస్ ఫ్యామిలీ
నిద్రపోతున్నావా.. కళ్ళు తెరిచి చూడు చంద్రబాబు..