
దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్టైన్మెంట్, బిజినెస్
, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
CM Vijay Divorce News: తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ వ్యక్తిగత జీవితం గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్, ఆయన భార్య సంగీత విడిపోతున్నారని.. విడాకుల వరకు వెళ్లారంటూ ప్రచారం సాగింది. అయితే, తాజాగా తమిళనాట ఒక క్రేజీ వార్త హల్చల్ చేస్తోంది. విజయ్, సంగీత దంపతులు తమ మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి మళ్లీ ఒక్కటయ్యారనేది ఇప్పుడు వైరల్‌గా మారింది.
గతంలో విజయ్ పాల్గొన్న పలు కీలకమైన సినిమా ఈవెంట్స్, రాజకీయ బహిరంగ సభల్లో సంగీత ఎక్కడా కనిపించలేదు. దీనితో వీరిద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు ఉన్నాయని, విడాకుల కేసు కోర్టు వరకు వెళ్లిందని పెద్ద ఎత్తున వదంతులు వచ్చాయి. నటి త్రిషతో విజయ్‌కు ఉన్న సాన్నిహిత్యమే దీనికి కారణమంటూ నెట్టింట ప్రచారం కూడా జరిగింది. అయితే, వాటన్నింటికీ చెక్ పెడుతూ.. ఈ జంట తిరిగి కలిసి జీవించడానికి అంగీకరించిందనే టాక్ ఇప్పుడు బలంగా వినిపిస్తోంది.
విజయ్ దంపతులు మళ్లీ కలవడానికి వారి కుటుంబ సభ్యులే కీలక పాత్ర పోషించారని సమాచారం. ముఖ్యంగా విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ చొరవ తీసుకుని, ఇరుపక్షాలతో మాట్లాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సంగీత లండన్ నుండి చెన్నైకి తిరిగి వచ్చారని, ఈ జంట ప్రస్తుతం కలిసి సమయం గడుపుతున్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్.
విజయ్, సంగీత మళ్లీ కలిశారనే వార్తలపై ఇప్పటివరకు సదరు నటుడి నుండి కానీ, ఆయన కుటుంబ సభ్యుల నుండి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇవన్నీ కేవలం సోషల్ మీడియా, అంతర్గత వర్గాల నుండి వస్తున్న ఊహాగానాలు మాత్రమే.
ఫ్యాన్స్ సంబరాలు విజయ్ కేవలం నటుడిగానే కాకుండా రాజకీయాల్లోనూ చురుగ్గా రాణిస్తూ, ఉన్నత స్థానాల్లో కొనసాగుతున్నారు. ఈ తరుణంలో ఆయన వ్యక్తిగత జీవితం మళ్లీ గాడిన పడిందనే వార్త వినడంతో తలపతి అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంబరాలు చేసుకుంటున్నారు. "మా అన్న కుటుంబం ఎప్పుడూ ఆనందంగా ఉండాలి" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.