
Cristiano Ronaldos sculpted abs at 41: ఫిఫా ఫీవర్ మొదలైపోయింది. ఆటగాళ్లు, అభిమానుల అరుపులతో నిన్న ఫిఫా వరల్డ్ కప్ 2026 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇందులో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది క్రిస్టియానో
రోనాల్డో.. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. 41 ఏళ్ల వయసులో కూడా రోనాల్డో సిక్స్ ప్యాక్ బాడీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆయన శరీరం ఒక శిల్పంలా ఉండటానికి, బాడీ ఫ్యాట్ తక్కువగా ఉండటానికి కారణం ఏంటి? కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే.. సరైన డైట్ ఫాలో అవ్వడం. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
రోనాల్డో సిక్స్ ప్యాక్ వెనుక ఉన్న అసలు రహస్యం బయటపడింది. ఆయన తన డైట్లో కొన్ని వస్తువులను ఖచ్చితంగా తీసివేస్తారు. మీరు కూడా అటువంటి బాడీ షేప్ పొందాలంటే కొన్ని నియమాలు పాటించాలి. ఫిఫా వరల్డ్ కప్ 2026 ఘనంగా మొదలైన వేళ, క్రిస్టియానో రోనాల్డో ఒక ప్రధాన ఆకర్షణగా మారారు. ఈ పోర్చుగీస్ సూపర్ స్టార్ గత 20 ఏళ్లుగా ఫుట్‌బాల్ రంగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
తన అద్భుతమైన ఫిట్నెస్తో ఆయన వయసు కంటే చాలా తక్కువగా కనిపిస్తారు. రోనాల్డో అంత ఫిట్‌గా ఉండటానికి ఎక్స్పర్ట్స్ చెప్పిన రహస్యం ఏమిటంటే.. కఠిన శ్రమ, క్రమబద్ధమైన శిక్షణ, సరైన నిద్ర, ప్లాన్ చేసిన డైట్. ఇవన్నీ కలిసి ఆయనకు శిల్పం లాంటి శరీరాన్ని, యవ్వనాన్ని అందిస్తున్నాయి. తన ఫిట్నెస్తోనే ఆయన మైదానంలో రాణిస్తున్నారు.
క్రిస్టియానో రోనాల్డో ఫిట్నెస్ సీక్రెట్: ఈ స్థాయి ఫిట్నెస్ ఆయనకు రాత్రికి రాత్రి రాలేదు. ఎంతో కాలంగా ఆయన చేస్తున్న కఠినమైన వర్కౌట్స్, ట్రైనింగ్ సెషన్స్, అజిలిటీ వర్కౌట్స్ ఆయన అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి తోడ్పడుతున్నాయి.
డైట్ కీలకం: డాక్టర్ దీపాలి శర్మ అభిప్రాయం ప్రకారం.. ఫిట్‌గా ఉండటానికి డైట్ చాలా ముఖ్యం. ఇది శరీరంలోని కండరాలు, శరీర కొవ్వు శాతాన్ని సమతుల్యం చేస్తుంది. రోనాల్డో తన ఆహారంలో ఎక్కువ శాతం ప్రోటీన్‌కు ప్రాధాన్యత ఇస్తారు. గుడ్లు ఆయన రోజువారీ డైట్లో తప్పనిసరిగా ఉంటాయి.
వీటితో పాటు తృణధాన్యాలు, ఎక్కువ సేపు శక్తినిచ్చే ఆహారాలను ఆయన తీసుకుంటారు. ఇవి ట్రైనింగ్ తర్వాత శరీరం త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. అలాగే, రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆయన కొన్ని ప్రత్యేక ద్రవ పదార్థాలను కూడా తీసుకుంటారు. షుగర్‌కు దూరంగా ఉంటారు. కూల్‌డ్రింక్స్ అస్సలే తీసుకోరు.