
దేశంలోని రిటైల్ పెట్రోల్ బంకుల నుంచి పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు భారీ మొత్తం పెట్రోల్ , డీజిల్ కొనుగోలు చేయడాన్ని కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ
కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వస్తుంది. సాధారణ వినియోగదారుల కోసం కేటాయించిన సబ్సిడీ పెట్రోల్, డీజిల్ ను రిటైల్ ధరతో కొనుగోలు చేస్తూ పారిశ్రామిక రంగాలు దుర్వినియోగం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
చమురు మార్కెటింగ్ సంస్థలు పరిశ్రమలకు, భారీ రవాణా సంస్థలకు విక్రయించే బల్క్ ఇంధన ధరలకు.. సాధారణ ప్రజలు బంకుల్లో కొనే రిటైల్ ధరలకు చాలా తేడా ఉంది. బల్క్ ధరలు మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. ప్రస్తుతం పెట్రో ధరలు ఆకాశాన్నంటుతున్న తరుణంలో కొన్ని పరిశ్రమలు, ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, ఫ్యాక్టరీలు నేరుగా పెట్రోల్ బంకులకు వచ్చి ట్యాంకర్ల ద్వారా తక్కువ ధరకే డీజిల్, పెట్రోల్‌ను తరలిస్తున్నారు. దీంతో ప్రభుత్వ రంగ చమురు సంస్థలకు భారీగా ఆదాయ నష్టం వాటిల్లుతోంది.
ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500.. సెమీస్ కు దూసుకెళ్లిన పీవీ సింధు
.