
ఇంటర్నెట్ డెస్క్: టాటా (Tatas)లను తిరిగి పశ్చిమబెంగాల్‌కు తీసుకువస్తామని సీఎం సువేందు అధికారి (Suvendu Adhikari) ప్రకటించారు. భూసేకరణపై నిరసనల కారణంగా 2008లో సింగూర్ నుంచి టాటా మోటార్స్ నానో
ప్రాజెక్ట్ వైదొలగిన తర్వాత ఆ సంస్థ తిరిగి బెంగాల్‌కు రాలేదన్నారు. దాదాపు 17 ఏళ్ల అనంతరం బెంగాల్ పారిశ్రామిక పునరుద్ధరణలో భాగంగా రాష్ట్రంలో పెద్దఎత్తున టాటా గ్రూప్ పెట్టుబడులు తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. త్వరలో బెంగాల్ పారిశ్రామిక వైభవాన్ని పునరుద్ధరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గతంలో సింగూర్, నందిగ్రామ్ ఆందోళనలకు దారితీసిన తప్పులను పునరావృతం చేయకుండా పెట్టుబడులను ఆకర్షించి, ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు.
2006లో పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా సింగూర్‌లో టాటా మోటార్స్ ‘నానో’ కార్ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటుచేయడానికి అప్పటి వామపక్ష ప్రభుత్వం దాదాపు వెయ్యి ఎకరాల భూమిని సేకరించింది. అయితే, బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ నేతృత్వంలో భారీ ఉద్యమం జరిగింది. తీవ్ర నిరసనల కారణంగా 2008 అక్టోబరులో టాటా గ్రూప్ ఆ ప్రాజెక్ట్‌ను బెంగాల్ నుంచి గుజరాత్‌కు తరలించింది. 2016లో దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ భూసేకరణను రద్దు చేసి, రైతులకు భూములను అప్పగించాలని చారిత్రక తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: ఆ తృణమూల్ నేతకు బంగ్లాదేశ్ అతివాద సంస్థలతో సంబంధాలు: రెబల్ ఎంపీ
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తిరుమల శ్రీవారిని రిలయన్స్ ఇండస్ట్రీస్ అధిపతి ముకేశ్ అంబానీ (Mukesh Ambani) దర్శించుకున్నారు.