
భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో చైనీస్ తైపీకి చెందిన చాన్ సు యుపై
సింధు విజయం సాధించింది.
స్పోర్ట్స్ డెస్క్: భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు ఆస్ట్రేలియన్ ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. సిడ్నీ వేదికగా జరిగిన మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో మూడో సీడ్ సింధు అద్భుత ప్రదర్శన చేసింది. చైనీస్ తైపీకి చెందిన చాన్ సు యు (Chen Su-yu)పై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ సునాయాసగా విజయాన్ని అందుకుంది.
తక్కువ సమయంలోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరులో సింధు 21-6, 21-9 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసింది. కోర్టు నలుమూలలా అద్భుతమైన స్మాష్‌లు, డ్రాప్ షాట్లతో చెలరేగిన ఈ భారత స్టార్, ప్రత్యర్థి కోలుకునేందుకు చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు. ఈ విజయంతో సింధు టైటిల్ వేటలో మరో అడుగు ముందుకు వేసింది. శనివారం జరగబోయే హై-వోల్టేజ్ సెమీఫైనల్ మ్యాచ్‌లో జపాన్ స్టార్ క్రీడాకారిణి, టాప్ సీడ్ అకానే యమగుచితో సింధు తలపడనుంది.
ఈ ప్రతిష్టాత్మక పోరులో గెలిచి సింధు ఫైనల్‌కు చేరాలని క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ సీజన్లో జరిగిన ఎనిమిది బీడబ్ల్యూఎఫ్ టోర్నమెంట్లలో సింధు సెమీఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి మాత్రమే. ఇలాంటి క్లిష్ట సమయంలో సింధుకు ఈ విజయం ఒక శుభసూచకం. మహిళల సింగిల్స్ డ్రాలో మరో భారత యువ క్రీడాకారిణి తన్వి శర్మ కూడా సత్తాచాటుతుంది. ఆమె తన తోటి క్రీడాకారిణి మాల్వికా బన్సోద్‌పై వరుస గేమ్‌ల్లో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. సెమీ-ఫైనల్స్‌లో స్థానం కోసం తన్వి జపాన్ క్రీడాకారిణి, టాప్ సీడ్ అకానె యమగుచితో తలపడనుంది.
భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత
బంగ్లాదేశ్ సంచలనం.. ఆసీస్‌పై తొలి సిరీస్ విజయం