
ఇంటర్నెట్‌డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)నకు న్యాయస్థానంలో భారీ ఊరట లభించింది. ప్రపంచవ్యాప్తంగా దిగుమతి అయ్యే వస్తువులపై ట్రంప్ విధించిన 10 శాతం గ్లోబల్ సుంకాలను (10%
worldwide tariff) వాషింగ్టన్‌లోని ఫెడరల్ సర్క్యూట్ అప్పీల్స్ కోర్టు సమర్థించింది. ఆ సుంకాల వసూలును కొనసాగించవచ్చని కీలక తీర్పునిచ్చింది.
గతేడాది భారత్ సహా అన్ని దేశాలపై ట్రంప్ భారీగా సుంకాలు విధించిన సంగతి తెలిసిందే. వాటిని ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆ వెంటనే ట్రేడ్ యాక్ట్ 1974లోని సెక్షన్ 122ను ఉపయోగించి జులై 24 వరకు అమల్లో ఉండేలా 10 శాతం తాత్కాలిక సుంకాలను ట్రంప్ విధించారు. రెండు వ్యాపార సంస్థలు ఇటీవల దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. అక్కడ ట్రంప్‌నకు ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా రాజ్యాంగం ప్రకారం సుంకాలను నిర్ణయించే అధికారం కాంగ్రెస్‌కు మాత్రమే ఉంటుందని న్యూయార్క్‌లోని ఫెడరల్ కోర్టు స్పష్టంచేసింది. ట్రంప్ యంత్రాంగం దీనిపై అప్పీల్ చేయగా.. వారికి అనుకూలంగా న్యాయస్థానం తీర్పునిచ్చింది. కాగా.. ఈ కేసుపై సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.