
కాలం ముందుకు సాగిపోతూ ఉంటుంది, కానీ కొన్ని గాయాలను మాత్రం గుండెల్లో శాశ్వతంగా మిగిల్చి వెళుతుంది. సరిగ్గా ఏడాది క్రితం, అహ్మదాబాద్‌లో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం వందలాది జీవితాలను ఒక్క క్షణంలో
ఛిద్రం చేసింది. ఆ ప్రమాదం కేవలం ఒక విమానాన్ని మాత్రమే కాదు, గాల్లోనూ, నేలపైనా ఎన్నో కుటుంబాల భవిష్యత్తును, కలలను, ఆశలను బూడిద చేసింది.ఈ రోజు ఆ ప్రమాద శిథిలాలను తొలగించారు, వార్తలు కూడా మరుగునపడ్డాయి. కానీ, ఆత్మీయులను కోల్పోయిన వారికి మాత్రం కాలం అక్కడే ఆగిపోయింది. ఆనాటి భయానక మధ్యాహ్నం నాటి పొగ, గందరగోళంలోనే వారి ప్రపంచం నిలిచిపోయింది. ఒకప్పుడు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన ఆ విషాదం, ఇప్పుడు వారికి ఒంటరి వేదనగా మిగిలింది.ఈ దుర్ఘటనలో ఒక కుటుంబం ఎలా ఛిన్నాభిన్నమైందో తెలిస్తే గుండె తరుక్కుపోతుంది. ఖేడా ప్రాంతానికి చెందిన రజనీకాంత్, పుష్పాబెన్ దంపతులు తమ కుమారుడిని చూసేందుకు యూకేకు బయల్దేరారు. జీవితంలో ఎన్నో కష్టాలను ఓర్చి, తమ కొడుకుని డాక్టర్‌గా చదివించి ఉన్నత స్థాయిలో నిలబెట్టారు. అలాంటి తల్లిదండ్రులు, తమ కుమారుడు కల్పించిన విలాసవంతమైన జీవితాన్ని చూసేందుకు వెళుతూ, అహ్మదాబాద్‌లో జరిగిన ఆ ప్రమాదంలో ప్రాణాలు విడిచారు.కన్న కలలు కాలిపోయిన వేళరజనీకాంత్, పుష్పాబెన్ దంపతులు తమ జీవితమంతా కష్టపడి కొడుకుని పెంచి పెద్దచేశారు. యాదృచ్ఛికంగా, ఆ ప్రమాదం జరిగిన క్యాంపస్ మెడికల్ నెట్‌వర్క్‌లోనే వారి కొడుకు వైద్య విద్యను అభ్యసించి డాక్టర్ కావడం ఒక విషాదకరమైన విధి విలాసం. డాక్టర్‌గా మారిన తర్వాత, వారి కుమారుడు యూకేకు వెళ్లి,